రివ్యూ: గద్దలకొండ గణేష్

రన్ టైమ్: రెండు గంటల 53 నిమిషాలు

నటీనటులు: వరుణ్ తేజ్, అథర్వ మురళి,పూజా హెగ్డే,మృణాళిని రవి,తనికెళ్ల భరణి,రచ్చరవి,సత్య,బ్రహ్మాజీ,శత్రు తదితరులు

సినిమాటోగ్రఫీ : అయానంక బోస్

మ్యూజిక్ : మిక్కీ జె మేయర్

నిర్మాతలు: రామ్ ఆచంట,గోపి ఆచంట

రచన,దర్శకత్వం: హరీష్ శంకర్

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 20,2019

కథేంటి?

డైరెక్టర్ కావాలనుకున్న అభి (అథర్వ) గ్యాంగ్ స్టర్ సినిమా చేసేందుకు నిజమైన రౌడీ గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) దగ్గరికే వెళ్తాడు.ఆ రౌడీ కథనే సినిమాగా తీయాలనుకుంటాడు.కానీ ఆ సినిమాలో కూడా తనే హీరోగా నటిస్తానంటాడు. దానికి అభి ఒప్పుకున్నాడా? ఆ తర్వాత దారి తీసిన పరిణామాలేంటి అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

జాలి,దయ లేని విలన్ పాత్రలో వరుణ్ తేజ్ అధ్బుతంగా నటించాడు.ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లోనే నటించిన వరుణ్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేసాడని చెప్పాలి.తమిళ హీరో అథర్వ మురళి ఫర్వాలేదనిపించాడు.పూజా హెగ్డే ఉన్న కాసేపయినా..గ్లామర్ తో అలరించింది.మృణాళిని రవి బాగా చేసింది.తనికెళ్ల భరణి,సుప్రియా పాఠక్ లు తమపాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్:

అయానంక బోస్ సినిమాటోగ్రఫీ బాగుంది.మిక్కీ జె మేయర్ పాటలు అలరిస్తాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను బాగా ఎలివేట్ చేశాడు.యాక్షన్ సీన్లు బాగున్నాయి.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తీసారు.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది.సీన్ల నడుమ సింక్ మిస్ అయింది.హరీష్ రాసుకున్న డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:
తమిళ్ లో హిట్ అయిన ‘‘జిగర్తాండ’’ ను తెలుగులో రీమేక్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్.గబ్బర్ సింగ్ తో రీమేక్ లు తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న హరీష్ ఈ మూవీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి మేజర్ పార్ట్ వరకు సక్సెస్ అయ్యాడు.గద్దలకొండ గణేష్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ పెట్టడం, ఎమోషనల్ కంటెంట్ పెట్టడం ప్లస్ అయింది.ఫస్టాఫ్ వరకు ఓకే గా సాగిపోయిన ఈ మూవీ సెకండాఫ్ లో ఊపందుకుంటుంది.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్,క్లైమాక్స్ రసవత్తరంగా సాగుతాయి.దీనివల్ల ప్రేక్షకుడు సాటిస్ ఫై అవుతాడు.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జర్రా జర్రా సాంగ్, ఎల్లువొచ్చి రీమిక్స్ ఈ రెండు పాటలు.. సూపర్ హిట్టే. ఐతే… సీన్ల మధ్య కంటిన్యూటీ మిస్ కావడం,సినిమా పేస్ పడుతూ లేస్తూ ఉండటం కాస్త ఇబ్బందిపెడుతుంది.ఈ మూవీని అంత లెంగ్త్ కూడా అవసరం లేదు.కొన్ని అనసరమైన సీన్లు పెట్టి బోర్ కొట్టించారు.తద్వారా ఇంకెప్పుడు ముగుస్తుందా అనిపిస్తుంది.ఓవరాల్ గా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్,డైలాగులు,మాస్ అప్పీల్ ఈ సినిమాను చూడబుల్ గా చేస్తుంది.

Latest Updates