ఉద్యమాలను అణిచివేయడం దారుణం: వివేక్ వెంకటస్వామి

Gaddam Vivek Meets manda krishna madiga

ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది… అలాంటి రాష్ట్రంలో ఉద్యమాల్ని అణిచివేయటం దారుణమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలిపిన వివేక్… హౌజ్ అరెస్ట్ ను ఖండించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం  వలనే తెలంగాణ వచ్చిందన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం ఎందుకు పాల్గొనటం లేదని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి. అంతేకాదు అంబేద్కర్ 128 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.

 

Latest Updates