పాక్ కు వెళ్లే నీళ్లు మళ్లిస్తాం.. నదులపై ప్రాజెక్టులు కడతాం

పుల్వమా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ను ఇరుకున పెట్టడానికి రెడీ అయ్యింది  కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాక్ నుండి దిగుమతి అవుతున్న గూడ్స్ పై 200శాతం పన్నును విధించింది. అంతకు ముందు ‘మోస్ట్ ఫెవర్డ్ నేషన్స్’ జాబితా లోంచి పాకిస్తాన్ ను తొలగించింది. తాజాగా.. భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లే మూడు నదులనీటిని ఆపివేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు.

“భారత్ నుండి పాకిస్తాన్ కు మూడు నదుల నుంచి నీరు వెళ్తుంది. మేము అక్కడ ప్రాజెక్టులను కట్టి నీటిని మళ్లించనున్నాము. ఈ మూడు నదులు మన యమునా నదిలో కలువనున్నాయి” అని గడ్కరి తెలిపారు.

పుల్వామా ఘటనతో యావత్ దేశం కదిలింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తప్పక తీసుకోవాలని కోరుతున్నారు దేశప్రజలు. ఇందులో బాగంగా..  రానున్న ప్రపంచ క్రికెట్ టోర్ని లో..  పాకిస్తాన్ తో ఆడకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ సుముఖం వ్యక్తం చేశాడు. ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రం జరుగవని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ లో పాక్ తో ఆడేదీ లేనిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పైనే ఆధారపడి ఉందని ఐపీఎల్ చైర్మన్ తెలిపారు.

Latest Updates