గగన్ దీప్ ‘రాయల్’ ఎంట్రీ

Gagandeep Kang becomes first Indian woman to be elected Royal Society Fellow
  • 360 ఏళ్లలో సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళ
  • ఇండియా నుంచే మరో నలుగురికి సభ్యత్వం
  • గౌరవ సభ్యుడిగా యూసఫ్ హమీద్ ఎంపిక

ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్, మైఖేల్ ఫారడే,రూథర్ ఫర్డ్, అల్బర్ట్ ఐన్ స్టీన్, డొరోతి హాడ్జ్ కిన్, అలన్ ట్యూరింగ్, ఫ్రాన్సిస్ క్రిక్. సైన్స్ ప్రపంచంలో అతి గొప్ప గౌరవంగా భావించే లండన్ లోని ప్రఖ్యాత రాయల్ సొసైటీలో సభ్యులు. ఇప్పుడు వీళ్ల సరసన భారత మహిళ  డా.గగన్ దీప్ కంగ్ చేరారు. 360 ఏళ్ల సొసైటీ చరిత్రలో ఓ భారతీయ మహిళ సభ్యురాలిగా నామినేట్ కావడం ఇదే తొలిసారి. పోయిన మంగళవారం రాయల్ సొసైటీ కొత్తగా 51 మంది సైంటిస్టులను సభ్యులుగా ఎంచుకుంది. వీళ్లలో గగన్ దీప్ కూడా ఒకరు. ఇండియాకే చెందిన గురుద్యాల్ బెస్రా, మంజుల్ భార్గవ, అనంత్ పరేఖ్,అక్షయ్ వెంకటేశ్‌ లకు కూడా ఈ ఏడాది రాయల్ సొసైటీలో సభ్యత్వం లభించింది.

మరో సైంటిస్టు డా.యూసఫ్ హమీద్ గౌరవ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇండియా తరఫున తొలిసారిగా 1841లో కర్సట్ జీ వాడియా రాయల్ సొసైటీకి సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత శ్రీనివాస రామానుజం(1918), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్(1944) ఎంపికయ్యారు.

ఎవరీ గగన్ దీప్?

వైరస్ వ్యాధులకు వ్యాక్సిన్లను కనుగొనేందుకు గగన్ దీప్ కంగ్ నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లల్లో వైరల్ ఇన్ ఫెక్షన్స్, రొటా వైరస్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్స్ పై రీసెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫరీదాబాద్ లోని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(టీహెచ్ఎస్టీఐ)కి ఎగ్జిక్ యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.మూడు వందలకుపైగా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లు ప్ర-చురించారు. టీకాలను రివ్యూ చేసే జాతీయ, అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీల్లో సభ్యురాలిగా ఉన్నారు.

Latest Updates