అంతరిక్షంలోకి వ్యోమగాములు: మొదటిదశ టెస్టులు పూర్తి

భారత్ తలపెట్టిన గగన్‌యాన్ కోసం వ్యోమగాములకు మొదటిదశ టెస్ట్ లు పూర్తయ్యాయి. బెంగళూరులో జరిగిన ఈ పరీక్షలలో పదకొండు మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఇందులో నలుగురు ఫైనల్ అయి ముగ్గురికి మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. గగన్‌యాన్ కోసం పైలెట్లను ఎంపికచేసింది ఇస్రో. వీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్లుగా పనిచేస్తున్నారు.  మొదటిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపుతుంది కావున…. అందుకు పైలెట్లే సరైనవారుఅని నిర్ణయించుకుంది ఇస్రో.

గగన్‌యాన్‌ను 2022వ సంవత్సరంలో  అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములను తిరిగి 2022లోనే వెనక్కి రప్పించనుంది ఇస్రో. వ్యోమగాములకు పరీక్షలు ఇండియన్ ఏయిరో స్పేస్ మెడిసిన్ (IAM) లో జరిగాయని తెలిపారు. ఈ ఇన్ట్సిట్యూట్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ (IAF) కు అనుంబంధంగా పనిచేస్తుంది.

IAMలో పైలెట్లకు కఠినమైన శారీరకపరీక్షలు జరిపామని… అందులో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, రేడియోలాజికల్ టెస్ట్, క్లినికల్ టెస్ట్, సైకలాజికల్ లాంటి పలు పరీక్షలు నిర్వహించినట్లు IAF తెలిపింది. భారత్‌లో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రష్యాలో తుది ట్రైనింగ్ జరుగనుందని తెలిపారు.

Latest Updates