5జీ నెట్‌తో లాభాలతో పాటు నష్టాలు..

సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌‌ తీసుకొస్తున్న కొత్త కొత్త డెవలప్‌‌మెంట్స్ రెండు వైపులా పదునైన కత్తిలాంటివి. వాడే తీరును బట్టి రిజల్ట్ ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకి వాడితే చెడు!! ఈ విషయంలో మొబైల్ టెక్నాలజీలు ఏ మాత్రం తీసిపోవు. త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్న 5జీ టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉంటుందో.. ముప్పు అంతకు మించి ఉంటుందని ఎక్స్‌‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 5జీ సర్వీసెస్‌‌కు సపోర్ట్ చేసే మొబైల్స్, 5జీ సిగ్నల్‌‌కు ఉండే బలమే దీనికి కారణమంటున్నారు.

టెక్నాలజీ డెవలప్‌‌మెంట్‌‌లో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఆ చెడును వీలైనంత తగ్గించినప్పుడు దానికి సార్ధకత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీతోనూ కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్న చిన్న సమస్యలు ఎందులోనైనా ఉంటాయని, 5జీ విషయంలో కాన్‌‌స్పిరసీ థియరీలు ఎక్కువగా వస్తున్నాయని, వాస్తవానికి ఈ టెక్నాలజీ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండబోదని మరికొందరు ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. అయితే ఈ విషయం చర్చకు రావాడానికి కారణం ఇప్పటికే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఫ్రాన్స్‌‌లో ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవలే అన్ని ఎయిర్ లైన్స్ కంపెనీలకు, 5జీ ఆపరేటర్లకు కొన్ని గైడ్‌‌లైన్స్ ఇష్యూ చేయడమే.

ఎయిర్ సిగ్నల్స్‌‌లోకి 5జీ

‘5జీ నెట్‌‌వర్క్‌‌కు ఫాస్ట్ కనెక్టివిటీ, ఎక్కువ బ్యాండ్ విడ్త్‌‌ ఉండడం వల్ల దీని సిగ్నల్ స్ట్రెంథ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్లైట్స్, హెలికాప్టర్ల సిగ్నల్‌‌కు సమానంగా ఉంది. దీని వల్ల వాటికి వెళ్లే సిగ్నల్‌‌లో 5జీ చొరబడి కమ్యూనికేషన్‌‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫ్లైట్ ఎగిరే టైమ్‌లో ఎత్తును తెలియజేసే అల్టీమీటర్‌‌‌‌ను హైజాక్ చేసే చాన్స్ ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్‌‌కు మధ్య కమ్యూనికేషన్ బ్లాక్ అవుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ టైమ్‌‌లోనూ ఇబ్బందులు వస్తాయి’ అని ఫ్రెంచ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ హెచ్చరించింది. 5జీ వల్ల తలెత్తే ఇబ్బందులపై పూర్తి స్థాయిలో ఎక్స్‌‌పర్ట్స్‌‌ సాయంతో పరిశోధనలు జరుగుతున్నాయని, తాము మళ్లీ చెప్పే వరకు తప్పనిసరిగా ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లలో 5జీ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసేలా చూడాలని అన్ని ఎయిర్‌‌‌‌లైన్స్​ను ఆదేశించింది.

కొత్తేమీ కాదు.. కానీ

విమానాల్లో ప్రయాణికులను వారి ఫోన్లు స్విచ్ఛాఫ్​ లేదా ఫ్లైట్ మోడ్‌‌లో పెట్టుకోవాలని చెప్పడం కొత్తమీకాదు. కానీ చాలా ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థలు విమానాల్లో ఆన్‌‌బోర్డ్ మాస్ట్ ఎక్విప్‌‌మెంట్ పెట్టి కాల్స్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నాయి. అయితే ఫ్రెంచ్ ఏవియేషన్ అథారిటీ మాత్రం తప్పనిసరిగా తమ గైడ్‌‌లైన్స్ ఫాలో కావాలని ఆదేశించింది. 5జీ డివైజ్‌‌ల కారణంగా ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ ఎక్విప్‌‌మెంట్‌‌లో ఏ మాత్రం సమస్య తలెత్తినా వెంటనే ఎయిర్ క్రూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌‌‌‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

5జీ బేస్ స్టేషన్స్ రిస్క్ తగ్గించాలి

5జీ బేస్ స్టేషన్స్ భారీ సంఖ్యలో పెట్టి సిగ్నల్స్ ఎయిర్ ట్రాఫిక్‌‌కు సమస్యగా మారకుండా రిస్క్ తగ్గించేలా పని చేయాలని టెలికాం కంపెనీలను ఫ్రెంచ్ ఏవియేషన్ అథారిటీ ఆదేశించింది. 5జీ బేస్ స్టేషన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్‌‌ స్ట్రెంథ్‌‌పైనా గత ఏడాది నవంబర్ నుంచి టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిపింది. 5జీ సిగ్నల్స్ ప్రభావం ఫ్లైట్స్‌‌పై ఏ విధంగా పడుతుందనేదానిపై ఇంకా ప్రయోగాలు కొనసాగిస్తున్నామని చెప్పింది.

కాన్‌‌స్పిరసీ థియరీలే అన్న వాదనలూ ఉన్నయ్

5జీ టెక్నాలజీపై చాలా కాన్‌‌స్పిరసీ థియరీలు వస్తున్నాయని,  హెల్త్‌‌పైనా తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుందని రూమర్లు వచ్చాయని కొందరు ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ థియరీల్లో అర్థం లేదని అంటున్నారు. అయితే గతంలో వచ్చిన టెక్నాలజీలతో పోలిస్తే 5జీ చాలా ఎక్కువ రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీని వాడుకుంటుంది. 3 నుంచి 300 జిగాహెడ్జ్‌‌ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం వల్ల 4జీ కన్నా 5జీ నెట్‌‌వర్క్ చాలా వేగంగా పని చేస్తుంది. అయితే దీనికి చాలా తక్కువ ఏరియాలోనే ఎక్కువ సిగ్నల్ టవర్స్ అవసరమవుతాయని ఎక్స్‌‌పర్ట్ చెబుతున్నారు. దీని వల్లే కాన్‌‌స్పిరసీ థియరీలకు అవకాశం పెరిగిందన్నారు. వీటి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కేన్సర్‌‌‌‌ లాంటి రోగాల రిస్క్ పెరుగుతుందన్న అపోహలు ఎక్కువయ్యాయని, అయితే ఫోన్ వాడడం వల్ల హెల్త్‌‌పై తీవ్రమైన ప్రభావమేమీ పడదని డబ్ల్యూహెచ్‌‌వో కూడా చెప్పిందంటున్నారు. కానీ మొబైల్స్‌‌ ఎక్కువగా వాడితే కేన్సర్ వచ్చే ముప్పు ఉందని డాక్టర్ ఫ్రాంక్ డీ వోచ్ తెలిపారు. మరోవైపు 5జీ రాకతో ఎక్స్‌‌పోజర్ కొంత పెరుగుతుందని యూకే ప్రభుత్వ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో భయం అక్కర్లేదని, 5జీ సిగ్నల్స్ ద్వారా వచ్చేది నాన్అయానైజింగ్ రేడియేషనేనని, దీని వల్ల ఏ ప్రమాదం ఉండదని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌‌బర్గ్ ప్రొఫెసర్ జాన్ విలియం ఫ్రాంక్ చెప్పారు. రకరకాల ఆపోహలు వస్తుండడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా 5జీ ఆలస్యమవుతోందని ఆయన అన్నారు.

క్లారిటీ లేకపోవడం వల్లే కాంట్రవర్సీలు

5జీ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎకానమీ పరంగా, లైఫ్‌‌స్టైల్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయని ప్రభుత్వాలే చెబుతున్నాయి. ఇండ్లు, ఆఫీస్, స్కూళ్లు ఇలా ప్రతి చోటా వైర్‌‌‌‌లెస్, మొబైల్ కనెక్టివిటీ విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. కానీ సైంటిఫిక్‌‌గా దీనికి సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల 5జీపై కాంట్రవర్సీలు ఎక్కువయ్యాయని విలియం ఫ్రాంక్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, రేడియో వేవ్స్‌‌పై లోతైన పరిశోధన జరగాలని, వీటిపై వివరాలను 5జీ ఆపరేటర్లు కూడా క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు.

5జీ అడ్వాన్స్‌‌మెంట్స్‌
5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే డేటా, కమ్యూనికేషన్ రంగాల్లో చాలా అడ్వాన్స్‌‌‌‌మెంట్స్ వస్తాయి.
4జీ కన్నా 100 రెట్లు వేగంతో 5జీ పని చేస్తుంది. ఆఫీస్ ఇంటర్నెట్‌‌తో సమానంగా మొబైల్ డేటా కూడా పని చేస్తుంది.
8జీబీ ఉండే సినిమా కేవలం ఆరు సెకండ్లలో డౌన్‌‌‌‌లోడ్ అవుతుంది.
కాన్ఫరెన్స్ కాల్‌‌లో ఉన్నప్పుడు మాట్లాడే వారికి అవసరమైతే రియల్‌ టైమ్‌‌లో ఒకేసారి వేర్వేరు భాషల్లోకి ట్రాన్స్‌‌‌‌లేషన్ చేసే టెక్నాలజీ కూడా వస్తుంది.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో 5జీ క్లౌడ్ సాయంతో ఒకేసారి నేవిగేషన్‌‌‌‌తోపాటు సినిమాల స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు.

5జీ వల్ల సమస్యలు

5జీ సర్వీసెస్ వల్ల డేటా సేఫ్టీ సహా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు.

డేటా సెక్యూరిటీ కోసం 5జీలో 4జీ కన్నా ఎక్కువగా డేటా ఎన్‌‌క్రిప్షన్ జరుగుతుంది. కానీ అన్ని రకాల డేటా ఎన్‌‌క్రిప్షన్ జరగదు. దీని వల్ల ఆ డేటాను 5జీ బేస్ స్టేషన్స్, యాంటీనాస్ యాక్సిస్ చేసే వీలు కుదరడంతో కంపెనీలు డేటాను వాటి ఇష్టానికి వాడుకునే ప్రమాదం ఉంది.

గతంలో ఎన్నడూ ఊహించనంత రేంజ్‌‌లో పర్సనల్ డేటా ట్రాన్స్‌‌మిషన్ జరిగిపోయే ముప్పు ఉంది. దీంతో యూజర్ల లైఫ్ స్టైల్, హాబీస్, ఇంటి అడ్రస్, మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా టెలికాం కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుంది.

ప్రైవేట్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాటి బిల్డింగ్స్‌‌లోకి క్రిమినల్స్ చొరబడకుండా సెట్ చేసుకునే స్మార్ట్‌‌ లాక్‌‌లను కూడా 5జీ సిగ్నల్‌‌ ఫ్రీక్వెన్సీ ద్వారా హైజాక్ చేసే చాన్స్ ఉంది.

సిగ్నల్ టవర్ల మానిప్యులేషన్ చేసి ఇద్దరు సేమ్ నెట్‌‌వర్క్‌‌ యూజర్ల మధ్య జరిగే చాటింగ్‌‌లో హ్యాకర్లు నేరుగా జోక్యం చేసుకునే చాన్స్.

భవిష్యత్తులో రాబోయే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో నేవిగేషన్‌‌కు 5జీ నెట్‌‌వర్క్ వాడాల్సి వస్తుంది. అయితే 5జీ నెట్‌‌వర్క్ ఆపరేటర్లు కార్‌‌‌‌ను హ్యాక్ చేసి దానిలో ఉన్న వారికి హాని తలపెట్టొచ్చు.

ఉగ్రవాదులు లేదా మరో దేశంపై కక్ష సాధించాలనుకునే దేశాలు 5జీని దుర్వినియోగం చేసి న్యూక్లియర్ ప్లాంట్స్, ఎయిర్‌‌‌‌ పోర్టులను వాళ్ల కంట్రోల్‌‌లోకి తీసుకునే ముప్పు ఉంది.

5జీ డివైజ్‌‌లలో స్టోర్‌‌‌‌ అయ్యి ఉండే డేటా అంతా క్లౌడ్‌‌లో సేవ్ అవుతుంది. 5జీ ఆపరేటర్స్ దీనిని వాడుకునే ముప్పు లేకపోలేదు. అలాగే క్లౌడ్‌‌పై హ్యాకర్లు అటాక్ చేసే ప్రమాదం ఉంది.

5జీ డివైజ్‌‌లలో యూజర్‌‌‌‌కి కూడా తెలియకుండానే సిస్టమ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఆటోమేటిక్‌‌గా అప్‌‌డేట్‌‌ అవుతుంది. ఆ టైమ్‌లో స్పైవేర్ లేదా ఇతర మాల్‌‌వేర్ వైరస్‌‌లను ఇన్‌‌సర్ట్ చేసే చాన్స్ ఉంది.

కంపెనీల చేతిలోకి యూజర్ల పర్సనల్ డేటా

అన్ ఎన్‌‌క్రిప్టెడ్ డేటాను బేస్ స్టేషన్లలో యాక్సిస్ చేయొచ్చు.

క్లౌడ్‌‌లో సేవ్ అయ్యే యూజర్ల డేటా హ్యాకింగ్ జరిగే ముప్పు.

5జీ ఫ్రీక్వెన్సీతో ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీ హైజాక్ చేసే ముప్పు.

5జీ నేవిగేషన్‌‌తో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను హ్యాక్ చేసే ప్రమాదం.

సిగ్నల్ టవర్ల మ్యానిప్యులేషన్‌‌తో యూజర్ల మెసే‌జ్‌‌లలో హాకర్ల జోక్యం.

ఆటోమేటిక్ సాఫ్ట్‌‌వేర్ అప్‌ డేట్‌‌ టైమ్‌‌లో హ్యాకర్లు స్పైవేర్ ఇన్‌‌సర్ట్ చేసే చాన్స్ ఉంది.

For More News..

పోలీస్‍ కావాల్సినోడు.. బతుకు పోరాటం చేస్తుండు

సాదాబైనామాలకు పట్టాలు ఇస్తలేరు.. పెండింగ్‌లో 9 లక్షల అప్లికేషన్లు

కాళేశ్వరంలో టన్నెల్‌‌ కాదని పైప్​లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

Latest Updates