గ్రేటర్ వార్.. ఓటుకు నోటు ఇక్కడ చెల్లదు

gajularamaram women raise voice on GHMC Elections 2020

కుత్బుల్లాపూర్ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిస్తుంది.. మాకు అభివృద్ధి కావాలి.. రాజకీయ నాయకుల మాటలు మేము నమ్మము… ఇది గాజులరామరం డివిజన్ పరిధిలో శివసాయి హిల్స్ వాసులు చెబుతున్న మాట. కోట్లలో టాక్స్ లు కడుతున్నా అభివృద్ధి మాత్రం జరగట్లేదని అన్నారు. కేవలం శంకుస్థాపనలే చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు చేయట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్న తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీని ఎవరు అభివృద్ధి చేస్తారో వారికే ఓట్లు వేస్తామని తెలిపారు. పాము కాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ మహిళలు.

Latest Updates