గంభీర్‌‌కు కోపం తెప్పించిన ‘ధోనీసిక్సర్’

న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్ హిస్టరీలో 2011 వరల్డ్‌‌కప్‌ ఓ మధుర జ్ఞాపకం. సొంతగడ్డపై జరిగిన నాటి ఫైనల్లో గౌతమ్ గంభీర్, కెప్టెన్‌‌ ధోనీ
అద్భుతంగా పోరాడారు. కానీ, గౌతీ కంటే ధోనీకే ఎక్కువ పేరొచ్చింది. అతను కొట్టిన ‘విన్నింగ్‌‌ సిక్సర్’ను ఇప్పటికీ అందరూ గుర్తు
చేసుకుంటున్నారు. అయితే, ఆ సిక్సర్ను గుర్తు చేస్తూ ‘క్రిక్‌‌ఇన్ఫో’ చేసిన ట్వీట్ గంభీర్‌‌కు కోపం తెప్పించింది. ‘క్రిక్‌‌ఇన్ఫోకు ఓ విషయం గుర్తు చేస్తున్నా. 2011 వరల్డ్‌‌కప్‌ గెలిచింది యావత్ దేశం. మొత్తం ఇండియన్ టీమ్, స్టాఫ్ సపోర్ట్‌‌ వల్లే ఇది సాధ్యమైంది. ఆ సిక్సర్‌‌పై మీకున్న వ్యామోహాన్ని వదులుకోవాల్సిన సమయం ఇది’ అని గౌతీ ట్వీట్ చేశాడు.

For More News..

డక్‌వర్త్‌–లూయిస్‌లో..లూయిస్‌ ఇకలేరు

కరోనా ఎఫెక్ట్: ఈఎంఐ వాయిదాతో ఫాయిదా ఉందా?

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు

Latest Updates