పని మనిషికి గంభీర్ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో టీమిండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​గంభీర్​ పెద్ద మనసు చూపెట్టాడు. తన ఇంట్లో పని చేసే సహయకురాలి ( పని మనిషి)కి అంత్యక్రియలు నిర్వహించి గొప్ప ఉదారతను చాటుకున్నాడు. ఒడిశాకు చెందిన 49 ఏళ్ల సరస్వతి పత్రా.. సుదీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీతో బాధపడుతోంది. అయితే ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో జాయిన్​చేశారు. చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతి చెందింది. లాక్​డౌన్​కారణంగా మృతదేహాన్ని ఒడిశా పంపించే అవకాశం లేకపోవడంతో గంభీర్​ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాడు. ‘నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషి కాదు. నా కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నా. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందర్ని గౌరవించాలనేది నా సిద్ధాంతం. అప్పుడే బెటర్​ సొసైటీని నిర్మించగలుగుతాం. నా ఆలోచన కూడా ఇదే. ఓం శాంతి’ అని గౌతీ ట్వీట్​చేశాడు.

Latest Updates