పెట్రోల్ తో గాంధీ డాక్టర్ సూసైడ్ అటెంప్ట్…

హైదరాబాద్ గాంధీ అసుపత్రిలో డాక్టర్ వసంత్ కుమార్ హల్ చల్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెట్రోల్ డబ్బా, లైటర్ తో ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పోలీసులు అతన్ని చాకచక్యంగా సూసైడ్ చేసుకోకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది కరోనా అనుమానాలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో అన్ని కేసులు నెగెటివ్ అనే తేలినా… పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయంటూ వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యునిగా భావిస్తూ డాక్టర్ వసంత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

దీనిపై తీవ్రంగా స్పందించిన వసంత్ కుమార్..తనను కారణం లేకుండా సరెండర్ చేశారని ఆరోపించారు. శానిటేషన్ పేరుతో సూపరింటెండెంట్ అవినీతికి పాల్పడ్డారన్నారు. ESI కంటే పెద్ద స్కాం గాంధీలో జరిగిందని ఆరోపించారు. గతంలో కూడా చాలా సార్లు తనను సరెండర్ చేశారని ఆరోపించారు డాక్టర్ వసంత్.

Latest Updates