ద‌గ్గినా, తుమ్మినా వ‌చ్చే తుంప‌ర్ల‌తోనే క‌రోనా

హైద‌రాబాద్: దగ్గినా ,తుమ్మినా వచ్చే తుంపర్లతో కరోనా వైరస్ వస్తుందని తెలిపారు గాంధీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ విన‌య్ శంక‌ర్. శుక్ర‌వారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయ‌న‌.. మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనాకు మందు అన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమ‌ని.. ఇతర జబ్బులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్క‌రూ న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవాలని.. ఆల్కహాల్ బేస్ డ్ శానిటైజర్ ను వాడితే ఉపయోగమ‌న్నారు. ఏసీ వాడకానికి కొద్దిగా దూరం ఉండటం మంచిదని తెలిపారు డాక్ట‌ర్ విన‌య్ శంక‌ర్.

క‌రోనా జాగ్ర‌త్త‌ల‌పై మ‌రో డాక్ట‌ర్ విష్ణురావ్.. మాట్లాడుతూ.. కరోనా వచ్చిన వారు ఎక్కువగా భయపడవద్దని.. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఏమి ఉండదన్నారు. 100లో 85 మందికి జాగ్రత్తలు తీసుకుంటే ఏమి కాదన్నారు. గాలి ద్వారా కరోనా రాదని .. దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతోనే కరోనా వస్తుందన్నారు. గుంపులుగా ఉన్న చోట మాస్క్ లు తప్పక వాడటం మంచిదని.. ఎన్ 95 మాస్క్ లు జనరల్ ప్రజలకు అవసరం లేదన్నారు. కరోనా ఉన్నవారు ..వారికి వైద్యం చేస్తున్నవారికే ఎన్ 95 మాస్క్ లు అవసరమ‌ని చెప్పారు. వాట్స్ అప్ లో చదివి మందులు వాడ వద్దని.. డాక్టర్ సూచనలేకుండా క్లోరోఫిన్ లాంటి మాత్రలు వాడవద్దన్నారు. ఇది అత్యంత ప్రమాదమ‌ని తెలిపారు డాక్ట‌ర్ విష్ణురావ్.

Latest Updates