త్వరలో గాంధీపీడియా… నిర్మల ఆసక్తికరమైన ప్రకటన

వికీ పీడియా.. దీనిగురించి అందరూ విన్నదే. ప్రపంచంలోని ఏ సంఘటన, వ్యక్తుల సమాచారం అయినా.. వికీపీడియాలో నోట్ చేస్తుంటారు. ఆ సమాచారాన్నే చాలామంది ఫాలో అవుతుంటారు. ఇదే పద్ధతిలో ఇపుడు కొత్త టర్మ్ వచ్చింది. అదే గాంధీపీడియా.

గాంధీ పీడియా అనే పదాన్ని ఇవాళ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రయోగించారు. వ్యక్తులు, పౌరుల నడవడికను మార్చే ఉద్దేశంతో.. గాంధీజీ పాటించిన విలువల ఆధారంగా గాంధీపీడియా సృష్టి జరుగుతోందని ఆమె చెప్పారు. ఇది ఆయన జాతికి సూచించిన మార్గం అనీ.. దానిని భవిష్యత్తుకు అందించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారామె.

ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ కూడా గురువారం నాడు ఆర్థిక సర్వేను చట్టసభల ముందుంచారు. ఆ సందర్భంగానూ ఆయన ఈ పదం వాడారు. ఓ ట్వీట్ కూడా చేశారు. ఎకో సర్వే 2019 అనే సర్వేను చేయబోతున్నామని చెప్పారు. ఇది మహాత్ముడు చెప్పిన సూత్రాల ఆధారంగానే జరుగుతోందన్నారు. ప్రతి పథకం.. పేదవాడిని బతుకు ముఖచిత్రాన్ని ఎలా మార్చిందో తెల్సుకునే ఉద్దేశంతో ఎకో సర్వే చేయబోతున్నామని చెప్పారు.

Latest Updates