గండిపేటకు భారీగా వరద నీరు

హైదరాబాద్ లో వరుసగా కురుస్తున్న వర్షాలకు గండిపేటలోకి భారీగా  నీరు చేరుతోంది. హిమాయత్‌ సాగర్‌ జలాశయం నుంచి 2 గేట్లు ద్వారా వరదనీరు మూసీకి చేరుతుండగా గండిపేట జలాశయం కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 కాగా, ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1786 అడుగులుగా ఉంది. మరో రెండు అడుగుల వరకు నీటిమట్టం పెరిగితే గేట్లు ఎత్తి వేసి.. నీటిని దిగువకు వదులుతారు. దీనికి సంబంధించి జలమండలి, రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యారు. గండిపేట దిగువ ప్రాంతంలోని తహసీల్దార్‌, మున్సిపల్  అధికారులకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు రెవెన్యూ అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. గండిపేట పరీవాహక ప్రాంతంలో వర్షం పడుతున్నందుననీటి మట్టం ఎప్పటికప్పుడు సరిచూసుకొని అవసరమైతే   గేట్లు ఎత్తివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

Latest Updates