లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠా అరెస్ట్

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న  ముఠాను నల్గొండ చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. లింగ నిర్ధరాణ పరీక్షలు చేసి  గర్భంలో ఉన్న శిశువు అడపిల్ల అయితే  అబార్షన్లు చేస్తున్న ఆర్ఎంపీలు మరికొందరిని అరెస్ట్ చేశారు. వీరిలో మొత్తం  17 మందిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు  నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.  చిట్యాలకు చెందిన భవాని , సాయి తేజ , చౌటుప్పల్ లోని ఉషారాణి , నార్కట్ పెళ్లికి చెందిన చైతన్య ఆస్పత్రులను సీజ్ చేశామన్నారు.

చట్టాలు రద్దు చేయాలన్న రైతులు.. కుదరదన్న కేంద్రం

Latest Updates