చిరుకు బర్త్ డే గిఫ్ట్ గా గ్యాంగ్ లీడర్ పోస్టర్

gang-leader-poster-as-chiru-birthday-gift

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ తో నాని హీరోగా నటిస్తున్నాడు. గురువారం చిరు బర్త్ డే సందర్భంగా ఆయనకు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాని కూడా చిరంజీవిలా గ్యాస్‌ లైటర్‌ పట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

‘మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆనాటి క్లాసిక్‌ గ్యాంగ్‌ లీడర్‌ ను గుర్తు చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ కు మేమిస్తున్న గ్రేట్ గిఫ్ట్. హ్యాపీ బర్త్‌డే సర్‌. ఎప్పటికీ మీరే మా గ్యాంగ్‌లీడర్‌.’ అని ట్వీట్ చేశాడు నాని.  ఈ సినిమాను  విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కిస్తున్నాడు.

 

Latest Updates