గ్యాంగ్‌ రేప్ కేసు..ఇన్వెస్టిగేషన్‌ టీమ్ రెడీ

ముందుగా 5 నుంచి 10 మందికి నోటీసులిచ్చే చాన్స్

నిందితుల ఫోన్నంబర్స్కలెక్ట్చేస్తున్న సీసీఎస్పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు: పంజాగుట్ట గ్యాంగ్‌ రేప్‌ కేసులో దర్యాప్తు కోసం సీసీఎస్‌ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్​టీమ్ ఏర్పాటైంది. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి ఆధ్వర్యంలో అధికారులు కేసు ఇన్వెస్టిగేషన్ పై బుధవారం డిస్కస్‌ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదులో పేర్కొన్న నిందితుల ఫోన్‌ నంబర్స్‌ కలెక్ట్‌ చేసి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ముందుగా 5 నుంచి 10 మందికి నోటీసులివ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న139 మందిలో ఓ మహిళ కూడా ఉండడంతో విమెన్‌ ఎస్‌ఐ కూడా టీమ్ లో ఉన్నట్టు తెలిసింది.

కేసును సీబీఐకి అప్పగించాలి: ఏబీవీపీ

యువతిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈసందర్భంగా పరిషత్‌ జాతీయ కార్యదర్శి ఉదయ్‌ ఐనాల మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా యువతిని మానసికంగా, శారీరకంగా హింసించిన వారిని శిక్షించాలని డిమాండ్‌  చేశారు.

దళిత సంఘాల ఆందోళన

బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్, తెలంగాణ ఎరుకల సంఘాలు ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ధర్నా చేశాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలను రక్షణ లేకుండా పోయిందని ఆరోపించాయి. బాధితురాలిని కులం పేరుతో దూషించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

Latest Updates