అప్పు చెల్లించడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్..

రాజస్థాన్‌లో 45 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వార్ జిల్లాలోని టిజారా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మహిళ అవసరం నిమిత్తం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంది. అతడు తన అప్పు చెల్లించమనడంతో ఆమె తన మేనల్లుడితో కలిసి సెప్టెంబర్ 17న వెళ్లి అప్పు చెల్లించి తిరిగి ఇంటిముఖం పట్టింది. వారు మార్గమధ్యలో ఉండగా.. ఒక కొండ వద్ద ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అడ్డొచ్చిన మేనల్లుడిని కొట్టారు. ఆ తర్వాత వారిద్దరిని కట్టిపడేశారు. అడ్డగించిన ఆరుగురిలో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయగా… మిగతావారు ఆమెను లైంగికంగా వేధించారు. అంతేకాకుండా.. ఈ ఘటనను అంతా మొబైల్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వారినుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిన మహిళ.. జరిగిన దాడిని తన భర్తకు తెలియజేసింది. ఆ తర్వాత భర్తతో కలిసి టిజారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. మిగతావారి కోసం గాలిస్తున్నాం’అని అల్వార్ డీఎస్పీ కుషల్ సింగ్ తెలిపారు.

For More News..

వీడియో: మోడీ బర్త్‌డే వేడుకలు చేయబోతే.. పేలిన హీలియం బెలూన్లు

రాష్ట్రంలో మరో 2,123 కరోనా పాజిటివ్ కేసులు

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు

Latest Updates