గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల అరెస్ట్

    కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తామని సీపీ వెల్లడి

ఖమ్మం అర్బన్, వెలుగు: గిరిజన మహిళ గ్యాంగ్‌ రేప్‌ కేసును రఘునాథపాలెం పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సోమవారం రఘునాథపాలెం పోలీస్​స్టేషన్​లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్​ఇక్బాల్​వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న అర్ధరాత్రి ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం భద్యాతండాకు చెందిన పెళ్లయిన గిరిజన మహిళను ఏడుగురు యువకులు సుకినితండా శివారులో గ్యాంగ్ రేప్ చేసి పరారయ్యారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మండల పరిధిలోని కైకొండాయిగూడెం క్రాస్ రోడ్డులో నిందితులను అరెస్ట్​చేసినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద 6 సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

హర్యాతండాకు చెందిన అజ్మీరా నాగేశ్వరరావు, సుకినితండాకు చెందిన భూక్యా సునీల్ లను ఏ1, ఏ2లుగా, హర్యాతండాకు చెందిన బానోతు ఉపేందర్, అంగోతు కల్యాణ్, బానోతు మోహన్, బానోతు చంటిలను ఏ3, ఏ4, ఏ5, ఏ6లుగా, సుకినితండాకు చెందిన మాలోతు అశోక్ ఏ7లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసును ఫాస్ట్​ట్రాక్​ కోర్టుకు అప్పగించనున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను అతి తక్కువ సమయంలో అరెస్ట్​ చేయడంపై ఏసీపీ ఎస్.వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ సంతోష్​లను సీపీ అభినందించారు. సుకినితండాకు చెందిన ఇద్దరు యువకులు, హర్యాతండాకు చెందిన మరో ఐదుగురు ఫుల్లుగా మద్యం తాగి మహిళ ఇంటికి వచ్చి బెదిరించి ఆమెను తండా శివారుకు తీసుకెళ్లి రేప్ చేశారు. స్థానికులు దీనిపై పోలీసులకు సమాచారం  అందజేయగా, వారు రావడం చూసి నిందితులు పారిపోయారు.

Latest Updates