మోటార్ సైకిల్ పై గంజాయి స్మగ్లింగ్ చేస్తూ…

ఓ వైపు క‌రోనాతో ప్ర‌పంచం ఆగ‌మైతున్నా.. ఈ కిలాడీ దొంగ‌లు మాత్రం త‌మ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. దేశ‌మంతా లాక్ డౌన్ చేసి ఇంట్లోనుంచి బ‌య‌టికి వెళ్లొదంటున్నా.. వీరు మాత్రం ఏకంగా గంజాయి త‌రలిస్తున్నారు. బుధ‌వారం 25 కేజీల గంజాయిని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సీలేరు నుండి మహారాష్ట్రలోని పర్బాని కి మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకెళ్తుండగా వాహనాల తనిఖీలో దొరికిపోయారు. ఏన్కూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కరోనా వైరస్ పై ప్రభుత్వం విధించిన ఆంక్షలలో భాగంగా బుధవారం ఏన్కూర్ తాహసిల్దార్ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీ చేస్తున్నాము. ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై మూడు బ్యాగుల్లో 25 కేజీల గంజాయిని త‌ర‌లిస్తున్నారు. మహారాష్ట్ర తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. ఇర్షాద్, హైదర్ ఆలీ అనే వ్యక్తులు పై కేసున‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు ఏ ఎస్ ఐ వెంకటేశ్వరావు.

Latest Updates