బడికెళ్లకుండా.. ఆన్ లైన్ క్లాసులు లేకుండానే చదువుకోవచ్చు…

ప్రకృతికి మించిన గురువు లేడు.. జీవితానికి మించిన పాఠాలు లేవు’చాలామంది చెప్పేమాట. కానీ, ఈ విషయాన్ని ఆచరణలో పెట్టేవాళ్లు చాలా తక్కువ. ‘పిల్లల్ని మంచి స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదివించాలి. మంచి ట్యూషన్‌‌‌‌‌‌‌‌ పెట్టించాలి’ ఇవే ఆలోచనలు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌వి. కానీ, ‘స్కూల్‌‌‌‌‌‌‌‌తో పనిలేకుండా కూడా పిల్లల్ని ఎడ్యుకేట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. జీవితాల్ని, ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చు” అంటూ అన్‌‌‌‌‌‌‌‌స్కూలింగ్‌‌‌‌‌‌‌‌ అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతున్నాడు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన గంగాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తన పదేళ్ల కవలలైన అనన్య, అమూల్యకు అన్‌‌‌‌‌‌‌‌స్కూలింగ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలోనే, అన్నీ నేర్పిస్తున్నాడు. ఆ పిల్లలకు చదువు అంటే.. ప్రకృతిని చదవడం.. కొత్త విషయాలు, కొత్త మనుషులను అర్థం చేసుకోవడం. ఇదే అన్‌‌‌‌‌‌‌‌స్కూలింగ్‌‌‌‌‌‌‌‌ లేదా  హోమ్‌‌‌‌‌‌‌‌ స్కూలింగ్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌. ఈ కొత్త కాన్సెప్ట్​ ఏంటో.. దీనివల్ల ఉపయోగాలేంటో గంగాధర్​ మాటల్లోనే..

థర్డ్​ క్లాస్​ వరకు మా పిల్లలిద్దరూ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్కూల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లారు. తర్వాత 2018 నుంచి వాళ్లు స్కూల్‌‌‌‌‌‌‌‌కే వెళ్లట్లేదు. ఆ సంవత్సరమే నేను ఉద్యోగం మానేసి ఒక ట్రావెల్ బిజినెస్​ స్టార్ట్ చేశాను. నా భార్య రమ్య కూడా జాబ్​ మానేసి పిల్లలతో ఉంటోంది. అప్పట్నించి మా పిల్లలు అన్​స్కూలింగ్, రోడ్​ స్కూలింగ్​లో ఉన్నారు. అంటే వాళ్లకు పెయింటింగ్​, డాన్స్, రాక్​ క్లైంబింగ్ ​చేయాలనిపిస్తే, వాళ్లకు వాళ్లే షెడ్యూల్ వేసుకుని ప్రాక్టీస్​ చేస్తారు. ఈ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌​ ముఖ్య ఉద్దేశ్యం పిల్లలకు నచ్చినపని చేయనివ్వడమే. ఈ అన్‌‌‌‌‌‌‌‌స్కూలింగ్‌‌‌‌‌‌‌‌ వల్ల మా పిల్లల్లో ఎన్నోరకాల టాలెంట్స్​ బయటపడ్డాయి.​ టీచర్​ లేకుండా మ్యూజిక్, డ్రాయింగ్​​ నేర్చుకున్నారు. అలాగే చాలారకాల యాక్టివిటీస్​ని ఆన్​లైన్​లో చూసి తెలుసుకుంటున్నారు. అయితే గైడెన్స్​ అవసరం అనుకున్నప్పుడు మాత్రం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆన్​లైన్​ టీచర్లతో చెప్పిస్తుంటాం. నాలాగా మొత్తం 400 కుటుంబాలు తమ పిల్లల్ని అన్​స్కూలింగ్​ కాన్సెప్ట్​తో పెంచుతున్నారు.

రోడ్ స్కూలింగ్​ కాన్సెప్ట్​ అంటే..

నాకు మొదట్నించీ ట్రావెలింగ్​ అంటే చాలా ఇష్టం. ​అందువల్ల కిందటేడాది మా నానో కార్​లో పదమూడు వేల కిలోమీటర్లు తొంభై రోజులపాటు ట్రావెల్​ చేశాం. ఆ టైమ్​లో మా పిల్లలు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఆ తొంభై రోజుల్లో రకరకాల కల్చర్​, సంప్రదాయలు, భాషలు, వంటలను గమనించారు. ఆ తొమ్మిదేళ్ల వయసులోనే వాళ్లకు క్యాంపింగ్​ చేసుకోవడం అలవాటైంది. అంతేకాదు, వాటర్​ సైకిల్, సస్టెయినబుల్ ​అగ్రికల్చర్​ గురించి.. ఇలా ఎన్నింటినో వాళ్లు ట్రావెలింగ్​లో తెలుసుకున్నారు.

ఒక్కటని కాదు.. అన్నీ నేర్చుకుంటున్నారు

మా పిల్లలు క్లాస్​రూముల్లో కూర్చుని అకడమిక్స్​ నేర్చుకోకున్నా.. వాళ్లు మ్యాథ్య్​, సోషల్, సైన్స్​అప్​డేట్స్​ తెలుసుకుంటారు. అలాగే లాంగ్వేజ్​ లెర్నింగ్​లోనూ బాగా ఇంట్రెస్ట్​ చూపిస్తారు. వీటితో పాటు ఇద్దరూ తైక్వాండో, భరతనాట్యం, మ్యూజిక్​, బుక్ రీడింగ్​లో యాక్టివ్​గా ఉంటారు. భవిష్యత్​లో మా పిల్లలు డాక్టర్​, ఇంజినీర్​ అవ్వాలనుకుంటే.. ఓపెన్​ టెన్త్​ రాయిస్తాం. తర్వాత వాళ్లకు నచ్చిన కాలేజీల్లో చేరొచ్చు. ఇప్పటికైతే చాలా హ్యపీగా ట్రావెలింగ్, ఎక్స్​ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్​ నేర్చుకుంటున్నారు.

అన్స్కూలింగ్​​.. పేరెంట్స్కి రూల్స్

  • స్కూల్​ మాన్పించి, అన్​స్కూలింగ్​ కాన్సెప్ట్​తో పిల్లలను పెంచాలనుకునే పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ మూడు విషయాల్ని గుర్తుంచుకోవాలని చెప్పాడు గంగాధర్. అలాగే తమలాంటి పేరెంట్స్​కి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. తమ ఎక్స్​పీరియెన్స్​ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా షేర్​ చేస్తుంటాడు.
  • కేవలం పేరెంట్స్ ఇంట్రెస్ట్​తో అన్​స్కూలింగ్​ని మొదులుపెట్టొద్దు. పిల్లలు కూడా స్కూల్​కి వెళ్లేందుకు ఇంట్రెస్ట్​ చూపించకపోతేనే దీన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకు రెగ్యులర్​గా స్కూల్​కి వెళ్లాలని ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లతో ఫోర్స్​ఫుల్​గా స్కూల్​ మాన్పించొద్దు.  పిల్లలకు, పేరెంట్స్​కు​ ఇద్దరికీ ‘ఓకే’ అయితేనే ఈ కాన్సెప్ట్ ఎంచుకోవాలి.
  •  పేరెంట్స్​లో ఇద్దరూ వర్కింగ్​ ఉండొద్దు. కచ్చితంగా మదర్​ లేదా ఫాదర్​ ఇరవై నాలుగ్గంటలు పిల్లలతోనే ఉండాలి. పిల్లలతో ఎక్కువ టైమ్​ గడుపుతూ, వాళ్లకున్న టాలెంట్, ఇంట్రెస్ట్​లను గమనించాలి. అప్పుడే ఏది నేర్పించాలి, ఎందులో ట్రైనింగ్​ ఇప్పించాలన్నది తెలుస్తుంది.
  •   పిల్లల నుంచి పేరెంట్స్​ ఎక్స్​పెక్టేషన్స్​ పెట్టుకోవద్దు. కాకపోతే వాళ్లకు అన్నీ అలవాటు చేయాలి. అలాగే  కొత్త విషయాలు పరిచయం చేయాలి. అందరు పిల్లలు వెంటనే నేర్చుకోకపోయినా, తర్వాత ఎప్పుడో అది బయటికి తెలుస్తుంది. అలాగని పిల్లలు అడిగినదల్లా ఇచ్చేయడం, ట్రైనింగ్​ క్లాసుల్లో వేయడం కూడా కరెక్ట్​ కాదు. కొన్నిరోజులు వాళ్ల ఇంట్రెస్ట్​ని అబ్జర్వ్​ చేసి నేర్పించాలి.మిడిల్ క్లాసు బడ్జెట్​..మిడిల్​ క్లాస్​ వాళ్లందరూ తమ పిల్లలను తక్కువ ఖర్చుతోనే.. రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్లొచ్చని నేనెప్పుడూ పర్సనల్​ ఎక్స్​పీరియెన్స్​తోనే చెప్తాను. మేం తొంభై రోజుల నార్త్​ ఈస్ట్ టూర్​ వెళ్లినప్పుడు.. ఎక్కడా హోటల్స్, బస్, ఫ్లైట్స్ బుక్​ చేసుకోలేదు. మా నానో కార్​లోనే అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాం. పగలు తిరుగుతూ, రాత్రిళ్లు దగ్గర్లోని పెట్రోల్​ బంకుల్లో టెంట్ వేసుకుని పడుకునేవాళ్లం. అక్కడైతే  లైటింగ్​, సీసీ కెమెరాలు, వాష్​రూమ్స్​ఉంటాయి కాబట్టి అది సేఫెస్ట్​ ప్లేస్. అక్కడివాళ్లను కొద్దిగా రిక్వెస్ట్​ చేస్తే, టెంట్ వేసుకోవడానికి ఒప్పుకునేవాళ్లు. తిండి విషయానికొస్తే లోకల్ ఫుడ్​ తింటూ, అక్కడి ట్యాప్​ వాటర్​నే తాగేవాళ్లం. ఇలా చేయడం వల్ల మా ట్రిప్​ అనుకున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనే సాగింది. ఇప్పటికీ మా నానో కార్​లోనే వందల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాం.– నిఖిత నెల్లుట్ల

Latest Updates