సింగిల్ విండో డైరెక్టర్ ​పదవికి గంగవ్వ పోటీ

సింగిల్ విండో డైరెక్టర్ ​పదవికి గంగవ్వ పోటీ
కామారెడ్డి జిల్లాలోనామినేషన్

లింగంపేట, వెలుగు: సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామారెడ్డి జిల్లాలో ఓ అంధురాలు నామినేషన్ వేశారు. లింగంపేట మండలం ముస్తాపూర్​కు చెందిన బోరంచ గంగవ్వ​ అనే 62 ఏళ్ల అంధురాలు శనివారం సింగిల్​విండో డైరెక్టర్​ పదవికోసం నామినేషన్ దాఖలు చేశారు.

ఎస్సీ మహిళకు రిజర్వు అయిన లింగంపేట సహకార సంఘం పరిధిలోని 5 వ(టీసీ)కి అంధురాలైన తన భార్య గంగవ్వతో బోరంచ భూమయ్య నామినేషన్ వేయించారు. ఆమె కులం సర్టిఫికెట్​ను నామినేషన్​ పత్రాలతో జత చేశారు. 62 ఏళ్ల వయసున్న అంధురాలైన ఈ పెద్దావిడ నామినేషన్​ వేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates