కొడుకు ముందే తల్లిపై గ్యాంగ్‌రేప్.. ఆవు-పులి కథ చెప్పి తప్పించుకున్న మహిళ

చాలామందికి చిన్నప్పుడు విన్న ఆవు-పులి కథ గుర్తుండే ఉంటుంది. ఆ కథలో పులి ఆవును తినడానికి పట్టుకుంటే.. అప్పుడు ఆవు.. ఇంటిదగ్గర దూడ ఉంది.. దానికి పాలు ఇచ్చి మళ్లీ వస్తాను అని అంటుంది. అచ్చం అలాంటి కథే మానవజీవితంలో కూడా జరిగింది. కేరళకు చెందిన ఓ వివాహితను ఆమె కొడుకు ముందే కొంతమంది వేధిస్తుంటే.. తన కొడుకును ఇంటి దగ్గర వదిలేసి మళ్లీ వస్తానని చెప్పి తప్పించుకుందట.

తిరువనంతపురం సమీపంలోని పుతుకురిచి పట్టణానికి చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలతో కలిసి పుతుకురిచి బీచ్‌కు వెళ్లింది. వారికి ప్రతిరోజు సాయంత్రం బీచ్‌కు వెళ్లే అలవాటు ఉంది. రోజు మాదిరిగానే ఆ మహిళ గురువారం కూడా భర్త, పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లింది. కాసేపటి తర్వాత ఆమె భర్త వారందరినీ అతని స్నేహితుని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె భర్త స్నేహితులు అక్కడ వీరికోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పటికే మద్యం సేవిస్తున్న వారు.. భర్త సహకారంతో ఆమెకు కూడా బలవంతంగా మందు తాగించారు. ఆ తర్వాత వారు ఆమెతో పాటు ఆమె కొడుకును బలవంతంగా వాహనంలోకి ఎక్కించి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె భర్త మరో కొడుకుతో స్నేహితుని ఇంటి వద్దే ఉండిపోయాడు.

కాగా.. మహిళను కొత్త ప్రదేశంలోకి తీసుకెళ్లిన భర్త స్నేహితులు.. ఆమెకు మందు తాగించి.. కొట్టారు. దాంతో మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కొన్ని గంటల తర్వాత కొడుకు ఏడుపు శబ్దం విని ఆ మహిళ స్పృహాలోకి వచ్చింది. లేచే చూసేసరికి ఆమె ఒంటిపై బట్టలు కూడా లేవు. దాంతో వారందరూ కొడుకు ముందే తనపై అత్యాచారం చేశారని మహిళ గుర్తించింది. అంతేకాకుండా.. ఆమె ఒంటిపై సిగరెట్‌తో కాల్చిన గాయాలున్నాయి. మహిళనే కాకుండా ఆమె కొడుకును కూడా వారు గాయపరిచారు. దాంతో మహిళ తనను కాసేపు వదిలేస్తే.. కొడుకును ఇంటి దగ్గర వదిలేసి వస్తానని వారిని వేడుకుంది. అలా వారిని ఒప్పించిన మహిళ.. తన కొడుకును తీసుకొని రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ వ్యక్తి తన కారులో మహిళ లిఫ్ట్ ఇచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసుల సూచన మేరకు ఆ వ్యక్తి మహిళను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడికొచ్చిన పోలీసులు.. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆమె భర్తతో పాటు అతని స్నేహితులు నలుగురిని అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత సదరు మహిళ డిశ్చార్జ్ అయ్యిందని.. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

For More News..

హర్భజన్‌‌ సింగ్ హీరోగా.. బిగ్‌‌బాస్ కంటెస్టెంట్ హీరోయిన్‌గా..

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక్క పోస్ట్‌తో కోటీ 21 లక్షల ఆదాయం

50 ప్లేట్ల పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేసిన్రు

Latest Updates