రౌడీషిట‌ర్ దారుణ హ‌త్య ..వెంటాడి..వేటాడి హ‌త్య చేసిన దుండ‌గులు

త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. చెన్నైలోని బేసిన్ బ్రిడ్జ్ ప్రాంతానికి స‌మీపంలో ఓ గ్యాంగ్ స్ట‌ర్ ను క‌నిక‌రంలేకుండా ఎనిమిది మంది నిందితులు దారుణంగా హ‌త‌మార్చారు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం..బేసిన్ బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన ర‌మేష్ బాబు రాత్రి వెళ్లే స‌మ‌యంలో 8మంది ముఠాస‌భ్యులు బాధితుడ్ని వెంబ‌డించారు. నిందితుల‌పై క‌ద‌లిక‌ల‌పై అప్ర‌మ‌త్త‌మైన బాధితుడు వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ప్ర‌య‌త్నంలో త‌న ఇంటి స‌మీపంలో ఉండ‌గా బాధితుడు ర‌మేష్ బాబును వెంట‌బ‌డిన నిందితులు సినీ ఫ‌క్కీలో రౌండ‌ప్ చేసి మ‌రీ హ‌తమార్చారు. అనంత‌రం నిందితులు స్థానిక పోలీస్ స్టేష‌న్ లో లొంగిపోయారు.

కాగా గ్యాంగ్ స్ట‌ర్ ర‌మేష్ బాబు 2016లో మ‌రో గ్యాంగ‌స్ట‌ర్ శివ‌రాజ్ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. ఆ శివ‌రాజ్ మ‌ద్ద‌తు దారులే ర‌మేష్ బాబును హ‌త్య చేశార‌ని పోలీసులు నిర్ధారించారు.

Latest Updates