ముగిసిన ఎంఎస్‌కే సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవి కాలం

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌ పదవీకాలం నిన్నటి(ఆదివారం)తో ముగిసింది. పదవీకాలనికి మించి మీరు కొనసాగలేరని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ప్రసాద్‌ తప్పుకోవడం బీసీసీఐ పాత రాజ్యాంగం ప్రకారం జరిగింది. దీని ప్రకారం సెలక్షన్‌ కమిటీకి నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే సవరించిన రాజ్యాంగం ప్రకారం కమిటీకి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రసాద్‌, గగన్‌ ఖోడాలను 2015లో నియమించగా, జతిన్‌ పరంజ్‌పే, శరణదీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ 2016లో చేరారు. అయితే బీసీసీఐ చీఫ్‌ తెలిపిన వివరాలు ప్రకారం ప్యానెల్‌ సభ్యులుగా ఎవరూ కొనసాగరు. వారి పదవీకాలం పూర్తియింది. పదవీకాలం దాటి వారు కొనసాగలేరు. కమిటీ సభ్యుల పనితీరు బాగుందని బీసీసీఐ 88వ వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత గంగూలీ తెలిపాడు. ప్రతీ ఏడాది సెలెక్టర్లును నియమించడం సరైనది కాదని సెలెక్టర్లు కోసం నిర్ణీత కాలాన్ని తాము నిర్ణయిస్తామన్నారు. ఐదుగురు వ్యక్తుల ప్యానెల్‌ పదవీకాలంలో భారతజట్టు  ఎన్నో విజయాలను సాధించింది.

Latest Updates