మహిళల క్రికెట్ జట్టుపై గంగూలీ ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సత్తా చాటిన భారత మహిళల జట్టు ఫైనల్స్ లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోయి, ఫైనల్స్ లో ఓడిన మహిళల జట్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఆడారని… ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారన్నారు. అంతేకాదు ఈ జట్టును చాలా ఇష్టపడుతున్నానని చెప్పారు.

మరోవైపు మహిళల జట్టుపై క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపించారు. చాలా గొప్పగా ఆడారంటూ మద్దతు పలుకుతున్నారు.

Latest Updates