నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా

భారత ఫుట్ బాల్ లెజెండ్ పీకే బెనర్జీ మృతి పట్ల బీసీీసీఐ చీఫ్ గంగూలీ సంతాపం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయానంటూ గంగూలీ ట్వీట్ చేశారు . ఇవాళ (20న) చాలా ప్రియమైన వ్యక్తిని కోల్పోయానన్నారు. తాను ఎంతో ప్రేమించిన.. గౌరవించిన వ్యక్తి బెనర్జీ అని కొనియాడారు. తాను 18 ఏళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు తన కెరీర్‌లో బెనర్జీ చాలా ప్రభావం చూపారన్నారు . బెనర్జీ  ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.  ఈ వారంలో ఇద్దరు ప్రియమైన వ్యక్తులను కోల్పోయామన్నారు. బెనర్జీతో పాటు సచిన్ తాను కలిసిన ఫోటోను పోస్ట్ చేశారు గంగూలీ.

గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నబెనర్జీ  ఇవాళ (20న) కోల్ కతాలో  తుదిశ్వాస విడిచారు.1965లో  జకార్తలో జరిగిన ఆసియా గేమ్స్ లో బెనర్జీ గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరపున  84 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి 65 గోల్స్ సాధించారు బెనర్జీ.

Latest Updates