ఆసియా XIలో భారత్‌ నుంచి నలుగురు: గంగూలీ

బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా బంగ్లాదేశ్ లో మార్చి 18, 21న ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా ఎలెవన్‌ జట్టులో పాకిస్తాన్  మినహా మిగిలిన ఆసియా దేశాల క్రికెటర్లు ఆడతారు. మరోవైపు వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో మిగిలిన దేశాల క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఆసియా ఎలెవన్‌ జట్టు కోసం భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ మహ్మద్ షమీ, స్పిన్నర్‌ కుల్‌దీప్ యాదవ్‌లు ఆసియా ఎలెవన్‌లో ఆడేందుకు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతేకాదు ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారట. ఆటగాళ్ల షెడ్యూల్‌ని పరిశీలించిన తర్వాతనే బంగ్లాదేశ్ బోర్డుకు దాదా సమాచారం తెలిపారట.

 

Latest Updates