హైదరాబాద్‌కు వస్తున్న యువత… గంజాయికి బానిసలవుతున్నారు

చదువు కోసం, జాబ్  కోసం హైదరాబాద్ కి వచ్చే యువకులు ఈజీగా గంజాయి వలలో చిక్కుకుంటున్నారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే గంజాయి స్మగ్లర్ల మెయిన్ కస్టమర్లుగా మారుతున్నారు. సిటీలోని చాలా ప్రైవేట్ హాస్టల్స్ గంజాయితో నిండిపోతున్నాయి.

హైదరాబాద్ లో డ్రగ్స్ కు యువతతో పాటు ఐటీ ఉద్యోగులు, కాలేజ్ స్టూడెంట్స్ బానిసలవడం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ ధరకు లభించడం, తేలిగ్గా వాడేందుకు వీలుండటంతో చాలామంది గంజాయికి అలవాటు పడుతున్నారు. నగరంలో పట్టుబడుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయే మొదటి స్థానంలో ఉంది. సిటీ పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వ NCB, DRI కూడా గంజాయి అక్రమ రవాణాని అడ్డుకుంటున్నాయంటే  నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతంలోనూ గంజాయి కేసులు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయంటున్నారు పోలీసు అధికారులు.   హైదరాబాద్  అడ్డాగా వివిధ ప్రాంతాలకు గంజాయ్ సప్లై చేస్తున్నట్లు చెబుతున్నారు. సప్లైయర్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ దండా పాన్ డబ్బా వ్యాపారులకు.. అక్కడ నుంచి మిగతా వారికి సప్లై అవుతున్నట్లు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఎంప్లాయిస్ , స్టూడెంట్స్ , వ్యాపారులు గంజాయ్ కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే మత్తుకు బానిసయ్యే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటున్నారు అధికారులు.

సిటీలో హుక్కా సెంటర్లు మూసేయడంతో.. స్టూడెంట్స్ అండ్ ఐటీ ఎంప్లాయిస్.. ప్రైవేట్ హాస్టల్స్ లోనే గాంజా కొడుతున్నట్లు తెలుస్తోంది.  తక్కువ ధరకే.. కావాల్సినంతగా దొరకడంతో మత్తులో తేలుతున్నారు యువత. గంజాయికి అలవాటు పడితే.. మానడం చాలా కష్టమని.. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు సైక్రియాటిస్టులు. పేరెంట్స్ పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలంటున్నారు.

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి పెట్టినా.. కొత్త కొత్త పద్దతులతో గుట్టు చప్పుడు కాకుండా కిలోల కొద్ది గంజాయి పోలీసులకు పట్టుబడుతూనే ఉంది. దీన్ని వ్యసనంగా మార్చుకుని.. చివరకు యువత ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు పోలీసులు.

Latest Updates