మండలి రద్దు చేస్తే వైసీపీకే నష్టం: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ శాసన మండలిని రద్దు చేయడం వల్ల భవిష్యత్ లో వైసీపీకే నష్టమని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు. వ్యవస్ధను రద్దు చెయ్యడం వెనుక బలమైన కారణాలుండాలి కానీ రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఉక్రోశంతో మండలిని రద్దు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. వచ్చే ఏడాదికి వైసీపీకి ఉన్న ఎమ్మెల్యే సంఖ్యా పరంగా మండలిలో అధికార పార్టీ సభ్యులు పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. 2004లో వైఎస్సార్ మండలిని పునరుద్దరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారని, మళ్లీ ఇప్పుడు జగన్ దాన్ని రద్దు చేస్తానని చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. రద్దు చేయ్యాలంటే దానికి కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం అవసరమని చెప్పారు.

Latest Updates