గరం గరం మిర్చి చాయ్

గరం గరం మిర్చి చాయ్​ సిప్​ చేస్తే.. ఏంటి మిర్చి చాయ్​నా! అని ఆశ్చర్యపోకండి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బెంగళూరులోని ‘ఛాయఫీ’ కేఫ్‌‌కి వెళ్తే  తీపికి తీపి, ఘాటుకు ఘాటు అంటూ మిర్చి టీని చేతిలో పెడతారు. ఇదేదో వెరైటీ ఇంగ్రీడియెంట్స్‌‌తో చేస్తారు అనుకునేరు. అచ్చం ఇంట్లో చేసుకునే టీలానే ఇది కూడా. కాకపోతే  ఇందులో తాజా పచ్చి మిరపకాయను దంచి వేస్తారు అంతే. ఈ టీ తాగితే జలుబు, తలనొప్పి, జ్వరం, దగ్గు వంటివి ఈజీగా మాయమవుతాయట. పైగా ఈవెనింగ్ టైంలో ఈ టీ తాగితే శ్నాక్స్‌‌తిన్న ఫీలింగ్‌‌కూడా కలుగుతుందట. దాంతో ఈ స్పెషల్​ టీ కోసం ‘ఛాయఫీ’ ముందు క్యూ కడుతున్నారు జనాలు. ఈ కేఫ్‌‌లో మిర్చీ టీ మాత్రమే కాదు కశ్మీరీ కవ్వా, ఓరియంటల్ జింజర్, దేశీ మసాలా, మారకాన్ మింట్ టీలు కూడా స్పెషల్ చాయ్‌‌లే.

For More News..

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్

మిస్డ్ కాల్‌‌ ఇస్తే లోన్ ఇస్తరట

రియల్టీలో మంచి ఆఫర్లు.. ఇల్లు కొనేద్దాం ఇప్పుడే!

Latest Updates