డంపింగ్ చేస్తూ అదుపు తప్పిన ట్రక్కు… ఇద్దరు మృతి

చెత్తను డంపింగ్ చేస్తున్న ఆర్ ఎఫ్ సి గార్బేజ్ వాహనం ఒక్కసారిగా  లేచి 25 అడుగు లోతులో జారి పడిపోయిన ఘటనలో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడి మరణించారు.   ఇమిలిబాన్ బస్ స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఇమిలిబన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో ఆర్ ఎఫ్ సి గార్బేజ్ వాహనం  చెత్తను డంపింగ్ చేస్తుండగా అదుపు తప్పి 25 అడుగు లోతులో జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్లు అరిఫ్ ఉద్దీన్, హజీఖాన్ లు ఇద్దర్నీ వెంటనే చికిత్స నిమత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. వీరి మరణవార్త తెలుసుకున్న GHMC ఉన్నతాధికారి విశ్వజిత్ అదీస్నాల్  చనిపోయిన వారి  కుటుంబీకులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించారు.

Latest Updates