హైదరాబాద్ సిటీకి ఇంకా ట్రా ‘ఫికరే’

హైదరాబాద్ సిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఎల్బీనగర్​ ఒకటి. ఎల్బీనగర్ అనగానే గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మించేందుకు పచ్చజెండా ఊపింది. రూ.448 కోట్ల వ్యయంతో పనులు స్టార్ట్​చేసి, ఇప్పటికే దిల్​సుఖ్ నగర్ ​నుంచి హయత్​నగర్​ వైపు ఫ్లైఓవర్​ నిర్మించి ప్రారంభించారు. అలాగే చింతలకుంటలో అండర్ పాస్ తో పాటు కామినేని వద్ద ఫ్లైఓవర్ నిర్మించి వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీరలేదు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తాలో హెవీ ట్రాఫిక్ ఉండేది. ఫ్లై ఓవర్ పూర్తయ్యాక ఎల్ పీటీ మార్కెట్​సమీపంలోని విజయవాడ బస్టాప్​వద్ద వాహనాలు భారీగా నిలుస్తున్నాయి.

బస్టాప్ కారణం….

ఫ్లై ఓవర్ ​ఎండింగ్​లో బస్టాప్​లు ఉండటం కారణం. రాత్రి వేళల్లో ఫ్లైఓవర్ పైన కూడా వాహనాలు నిలుస్తున్నాయి. అలాగే కామినేని హాస్పిటల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ఎండింగ్​లో బస్టాప్ తో పాటు యూటర్న్ ఉండటంతో పరిస్థి తి ప్రమాదకరంగా మారింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఫ్లై ఓవర్ కింది నుంచి, కాలనీల నుంచి వచ్చిన వారు అక్కడే యూటర్న్ తీసుకుం టున్నారు. ఫ్లై ఓవర్ పై నుంచి వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఫ్లై ఓవర్ దిగిన బస్సులు వెంటనే బస్టాప్ వద్ద ఆగాల్సి ఉంది. వెనకొచ్చే వాహనాలు కూడా ఆగిపోతున్నాయి.

ట్రాఫిక్‌ సమస్య పోవాలంటే….

ఎల్బీనగర్​సర్కిల్ ​ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలకు ముఖద్వారం. ఈ ప్రదేశంలో ట్రాఫిక్​సమస్య పోవాలంటే భూసేకరణ చేసి విజయవాడ వైపు బస్టాప్ ను కొంత లోపలికి నిర్మిస్తే తప్ప శాశ్వత పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు. అలాగే హయత్ నగర్ నుంచి దిల్​సు ఖ్ నగర్ కుడివైపు ఫ్లైఓవర్ తో పాటు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోలు వైపు అండర్ పాస్, కా మినేని వద్ద కుడివైపు ఫ్లైఓవర్​ను అధికా రులు వేగవంతం చేశారు. రూ.44 కోట్ల నిధులతో చేపట్టిన ఎల్బీనగర్​కుడివైపు ఫ్లైఓవర్​ను 2020 మార్చి లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్ఆర్ డీపీ అధికా రులు చెబుతున్నారు. పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. అదే విధంగా రూ.38కోట్లతో 520 మీటర్ల పొడవున సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోలు వైపు అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించారు.

వన్ సైడ్ మాత్రమే నిర్మాణం….

ప్రస్తుతం రూ.19 కోట్లతో వన్ సైడ్ మా త్రమే నిర్మిస్తున్నారు. ఏడాది చివరికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. వీటితో పాటు కామినేని ఆస్పత్రి ముందు నాగోలు నుం చి ఎల్బీనగర్ వైపు ఫ్లై ఓవర్ పనులను నాలుగు నెలల క్రితమే ప్రారంభించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ను 42కోట్ల నిధులతో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పనులను వేగవంతం చేసినప్పటికీ మధ్యలో వాటర్ పైప్ లైన్ వంటి మార్గా లు వస్తుండటంతో శాఖల మధ్య సమన్వయం లేక పనులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది.

యుటర్న్​ ఇబ్బందులు….

ఫ్లై ఓవర్, అండర్ పాస్ పనులు ఒకేసారి జరుగుతుండటంతో సాగర్ రింగ్ రోడ్డు వైపు నుంచి ఉప్పల్ వెళ్లే రూట్ ను మూసివేశారు. అలాగే ఉప్పల్ నుంచి వచ్చే వాహనాలు సాగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాలంటే చింతలకుంట సమీపంలోని ఎల్​పీటీ వద్ద యూటర్న్ చేసుకొని వెళ్లాలి. దీంతో ఉదయం వేళల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాల ఎంట్రీ టైమ్ లో హెవీ ట్రాఫిక్​ ఉంటోంది. రాత్రి 9 అయ్యిందంటే ఆంధ్రా ప్రాం తానికి వెళ్లే బస్సులు, ఇతర వాహనాలన్నీ ఎల్బీనగర్​కు చేరుకుంటాయి. అర్థరాత్రి 2 గంటల వరకు ఇదే పరిస్థి తి కనబడుతోంది. రాత్రి10 దాటిన తర్వాత ఎల్ బీ నగర్ లోని ఫ్లై ఓవర్ కింద బారికేడ్లను తొలగించి సాగర్ రింగ్ రోడ్డు మీదుగా వాహనాలను పంపిస్తు న్నారు. మున్సి పల్, ట్రాఫిక్ అధికా రులు సమన్వయంతో ఉంటే కొంత వరకు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Latest Updates