గౌరీ లంకేశ్ హత్యకేసులో BJP అభ్యర్థి సాధ్వీకి క్లీన్ చిట్

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో భోపాల్ BJP ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌కి ఊరట లభించింది. లంకేశ్ హత్యతో ఆమెకు సంబంధం లేదని తేల్చి చెప్పింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన స్వగృహంలో గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు సిట్‌ను ఆదేశించింది. ఆ కేసులో అదుపులోకి తీసుకున్న 16 మందిలో సాధ్వీ ప్రగ్యాసింగ్ కూడా ఒకరు. కాగా ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ హత్య కేసులో ఆమె ప్రమేయమున్నట్టు విచారణలో తాము ఎక్కడా గుర్తించలేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది. కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఆమె ప్రమేయాన్ని రుజువు చేసే ఆధారాలు ఎక్కడా లభించలేదని తెలిపింది.

Latest Updates