‘ఆప్’ నాయకులకు విజన్ లేదు: గంభీర్

తనకు రెండు ఓటరు కార్డులున్నాయని ఆప్ అభ్యర్థి చేసిన ఫిర్యాదుపై గౌతమ్ గంభీర్ ​ఆదివారం స్పందించారు. ప్రజలకోసం చేసిం దేమీలేకే ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆప్‌ కు విజన్​ లేదని, నాలుగున్నరేళ్ల ఆ పార్టీపాలనలో ఢిల్లీ అభివృద్ధి చెందలేదని అన్నారు. ఓటరు కార్డుల విషయం ఈసీ చూసుకుంటుందన్నారు. తనకు రాజేంద్ర నగర్​నుంచే ఓటర్ ​ఐడీ ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి కరోల్ బాగ్​లో పెరిగినా అక్కడ ఎప్పుడూ ఓటేయలేదని, ఓటరు కార్డు కోసం అప్లై చేయలేదని తెలిపారు. గంభీర్.. రెండు చోట్లనుంచి ఓటరు కార్డులు కలిగి ఉన్నాడన ఆరోపిస్తూ అతన్ని ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకిఆప్​ అభ్యర్థి ఆతిషి ఫిర్యాదు చేసింది.

Latest Updates