డూప్ తో గంభీర్ ఎన్నికల ప్రచారం: మనీష్ సిసోడియా

ఎర్రటెండలో ప్రచారం చేయలేక ఎంపీ అభ్యర్థులు బేజారైతున్నరు. ఆఖరి నిమిషంలో టికెట్లుపొందిన సెలబ్రిటీలైతే అరిగోసవడుతున్నరు. మాజీ క్రికెటర్ , ప్రస్తుతం ఈస్ట్​ ఢిల్లీ బీజేపీ క్యాండేట్ గౌతం గంభీర్ఎండలు తట్టు కోలేక ఏకంగా డూప్ తో ప్రచారం చేయిస్తున్నరని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించిన్రు. సదరు డూప్ కాంగ్రెస్ నాయకుడు కావడంతో ముచ్చట రచ్చకు దారి తీసింది.

ఒరిజినల్ గంభీర్ ఏసీ జిప్సీ కారు లో కూర్చొని ఉండగా, అతని పోలికలతోనే టోపీ పెట్టుకున్న నకిలీ వ్యక్తి ఎండలో ట్రాలీపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లున్న ఫొటోను సిసోడియా ట్వీట్ చేశారు. గంభీర్ ఎండలో ఎక్కువ సేపు ఉండలేరని, అందుకే డూప్ తో పని కానిస్తున్నరని చెప్పిన్రు. కాగా , గంభీర్ కు డూప్ గావ్యవహరించి న వ్యక్తి పేరు గౌరవ్ అరోరా అని, అతను కాంగ్రెస్ నాయకుడని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 96వార్డు నుంచి పోటీ కూడా చేసిండని, ఇది కాంగ్రెస్–బీజేపీల మధ్య నకిలీ పొత్తుకు నిదర్శనమని సిసోడియా మండిపడ్డరు.

Latest Updates