ఏపీ నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

gautam-sawan-takes-charge-andhra-pradesh-dgp

అమరావతి: ఏపీ డీజీపీ గా  గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. చార్జ్ తీసుకున్న తర్వాత  గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తనకు  అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పని చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

పోలీస్ శాఖ సేవభావంతో పనిచేయాలని, పేద ప్రజలు, సామాన్య ప్రజలకి పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ కోరారని ఈ సందర్బంగా మీడియాకి తెలిపారు గౌతమ్ సవాంగ్. పోలీస్ శాఖకు కావలసిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని  ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.

ఆడవాళ్ళ,చిన్న పిల్లల మీద నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఏపీ ని నేరరహిత రాష్ట్రంగా చేసే విధంగా డిపార్ట్మెంట్ కృషి చేయాలని నూతన డీజీపీ  అన్నారు. సైబర్ క్రైమ్ అరికట్టడంలో ఏపీ పోలీస్ మరింత కష్టపడాలని ఆయన అన్నారు.

Latest Updates