మూడుముళ్లకు జీన్‌ ముడి

genes linked to Marital life
  • పెళ్లి జీవితంలో ఆనందాన్ని నిర్ణయించే జన్యువులు
  • సమస్యల్లో భాగస్వామికి అండగా నిలవడానికి అవే కీలకం
  • ఆక్సిటోసిన్ జీన్ పై అధ్యయనం చేసి తేల్చిన అమెరికా సైంటిస్టులు

genes linked to Marital lifeపెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. అలాంటి ఒక జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ముందు ఏడు తరాలు.. వెనక  ఏడు తరాలను లెక్కలోకి తీసుకోవాలంటారు పెద్దలు. ఆస్తి అంతస్తులు, అందం, గుణం, వ్యక్తి త్వం, జాతకాలు ఇలా ఎన్నో విషయాలను పరిశీలించి, విచారించి మరీ పిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. మరి, వాటితోనే ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్లి జీవితం
ఆనందంగా సాగిపోతుందా? దానికి అమెరికా బింఘామ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు ఇంకో
విషయాన్ని కలిపి సమాధానం చెబుతున్నారు. అదే ‘జీన్స్​’.

ఓ జంట పెళ్లి జీవితం హ్యాపీగా సాగాలంటే జన్యువులూ ప్రధాన కారకంగా ఉంటాయంటున్నారు. ఒకే రకమైన జన్యువులుండే జంటలు పెళ్లి జీవితాన్ని ఆస్వాదిస్తారని చెబుతున్నారు. సమస్యల్లో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారని వివరిస్తున్నారు. అందుకు ఆక్సిటోసిన్ రిసెప్టర్ జీన్ (ఓఎక్స్​టీఆర్)ను సైంటిస్టులు వాడుకున్నారు. ఆక్సిటోసిన్ కు లవ్ హార్మోన్ అని పేరు. ఓ జంటకు సంబంధించి భావోద్వేగాల్లో దానిది కీలక పాత్ర. కాన్పు, లైంగిక చర్య టైంలో అది ఎక్కువగా రిలీజ్ అవుతుంటుం ది. అందుకే ఆక్సిటోసిన్ ను నియంత్రించే ఓఎక్స్​టీఆర్ ను ఎంచుకున్నామని చెబుతున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన రిచర్డ్​ మ్యాట్సన్ అనే అసోసియేట్​ ప్రొఫెసర్.

సమాజ స్థితిగతులు, నమ్మకం వంటి మానవ సామాజిక ప్రవర్తనలను ఓఎక్స్​టీఆర్ నియంత్రిస్తుందని చెబుతున్నారు. కాబట్టి భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఎంత బాధ్యతగా, మద్దతుగా నిలవడంలో అది ఎలాంటి పాత్ర పోషిస్తోందో అధ్యయనం చేశారు. అందుకు 79 జంటలను ఎంచుకున్నారు. పేరుపొందిన సైకాలజిస్టులు, జెనెటిస్టుటు (జన్యుశాస్త్రవేత్తలు), న్యూరోఎండోక్రైనాలజిస్టులు (నరాలు, హార్మోన్ల స్పెషలిస్ట్​ డాక్టర్లు) ఆధ్వర్యం లో పరిశోధన చేశారు.
ఆ జంటలకు పెళ్లితో సంబంధం లేని వ్యక్తిగత సమస్యపై మనసు విప్పి మాట్లాడుకోవాలంటూ ఓ
పది నిమిషాల టైమిచ్చారు. భాగస్వామి చెప్పేది వినడం, సమస్య పరిష్కార నైపుణ్యాలు , అర్థం
చేసుకోవడం వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతేగాకుండా ఆ జంటల
లాలాజలాన్ని సేకరించారు. అందులోని జన్యువులను పరిశీలిం చారు. దాని ఆధారంగా ఎవరు
ఎలా స్పందిం చారనేది తేల్చారు.
రెండంటే రెండు ..
ఓఎక్స్​టీర్ జీన్ లోని ఆర్ఎస్ 1042778, ఆర్ఎస్ 4686302 అనే రెండు అలీల్స్​ (జన్యువు ఏర్పడడానికి అవసరమైన భాగాలను అలీల్స్​ అంటారు) ను అంచనా వేశారు. ముందుగా అనుకున్నట్టే ఆ రెండు అలీల్సే నాణ్యమైన పెళ్లి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆర్ఎస్ 1042778పై రెండు టీ అలీల్స్ (టీటీ జీనోటైప్) ఉన్న వాళ్లు తన జీవిత భాగస్వామికి మద్దతుగా నిలవలేదని తేల్చారు. సమస్యను దాంతో పాటు భాగస్వామిని అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టు గుర్తించారు. అదే జీన్ రకం.. ఆటిజం (మందబుద్ధి)కి కారణమవుతున్నట్టు ఇతర పరిశోధనలను గుర్తుచేశారు.

అలీల్స్​ వేర్వేరుగా ఉన్న జంటలు పెళ్లి జీవితంలో సంతృప్తి చెందడం లేదని తేల్చారు. ఓ మంచి పెళ్లి జీవితానికి ఈ జన్యువులు కారకాలే అవుతున్నా, నిజజీవితంలో వాటిని వాడుకోవడం మాత్రం కరెక్ట్​ కాదని రిచర్డ్​ మ్యాట్సన్ చెబుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అది మేలు చేసినా, చాలా సందర్భాల్లో మాత్రం దాని వల్ల చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒత్తిడి సమస్యలను గుర్తించేందుకు ఈ టీటీ జీనోటైప్ ఉపయోగపడుతుందని వివరించారు. మున్ముందు దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Latest Updates