నిజం చచ్చిపోకముందే మీ గొంతు విప్పండి

జార్జ్  రెడ్డి.. 1965-75  సంవత్సర మధ్య  కాలంలో ఉస్మానియా యూనివర్శిటిలో చదువుకొని, ఉద్యమ నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి. మెరుగైన సమాజ స్థాపనే లక్ష్యంగా, చివరకి ఆ లక్ష్య సాధనలోనే ప్రాణాలు కోల్పోయిన అతడి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.  జార్జ్ రెడ్డి-  ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్  అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాలో వంగవీటి ఫేమ్ సందీప్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు . ఈ చిత్రానికి ‘దళం’ దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు దాము రెడ్డి, అప్పి రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

‘పేదలు ఇంకా పేదలు అవుతున్నారు.. ధనికులు ఇంకా ధనికులు గా మారుతున్నారు’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో పలు విభిన్న అంశాలను చూపించారు. ‘రెయిజ్ యువర్ వాయిస్.. బిఫోర్ ట్రూత్ డైయిస్’ అంటూ హీరో సందీప్ మాధవ్ చెబుతున్న డైలాగా ఆకట్టుకుంటోంది. కళాశాలలో రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య గొడవ, న్యాయం కోసం విద్యార్ధుల పోరాటాలు, రైతుల పరిస్థితి.. ఇలా ఆసక్తి కరమైన అంశాలతో ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్ , శాండీ, శతృ, అభయ్ బెతిగంటి తదితరులు నటిస్తున్నారు.

జార్జి రెడ్డి డెత్ మిస్టరీ వెనుక నిజాలు