గర్భ నిరోధక నగలు

Georgia researchers create pregnancy-preventing accessories

మెడలో నెక్లెస్ లు.. వేళ్లకు ఉంగరాలు..చేతికి అందమైన వాచీ.. చెవికి తళతళలాడే రింగులు.. అన్నీ అందం కోసమే. అందాన్ని పెంచే ఆ నగలే గర్భం రాకుండానూ అడ్డుకుంటాయి తెలుసా? అదెలా సాధ్యమన్న డౌట్ రావొచ్చు. అక్కడే టెక్నాలజీ లాజిక్ ను వాడి ఈ గర్భ నిరోధక నగలను తయారు చేశారు అమెరికాలోని జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు. నెక్లెస్ పెండెంట్ , ఇయర్ రింగులు,ఉంగరాలు, రిస్ట్​ వాచీలకు కింది భాగంలో ట్రాన్స్​డెర్మల్ ప్యాచ్ ను పెట్టారు. మూడు లేయర్లుగా ఉండే ఆ ప్యాచ్ లో రెండో ప్యాచ్ కు మందు పెడతారు. ఘన హార్మోనే ఆ రెండోప్యాచ్. ఫస్ట్​ ప్యాచ్ ఇంపర్మియబుల్ లేయర్. రింగులు, వాచీకి అంటుకుని ఉంటుందది. రెండో లేయర్ లోని డ్రగ్ చర్మం లోకి ఇంకేలా మూడో లేయర్ చూస్తుం ది.

అలా చర్మంలోకి వెళ్లిన హార్మోన్​ రక్తంలో కలిసి గర్భనిరోధకంగా పనిచేస్తుం ది. ఇప్పటికే దీనిని పందులు,ఎలుకల్లో ప్రయోగించి సక్సెస్ అయ్యారు సైంటిస్టులు. గర్భం రాకుండా ఈ గర్భ నిరోధక నగలు కావాల్సినంత హార్మోన్​ను విడుదల చేస్తాయని సైంటిస్టులు చెప్పారు. రెగ్యులర్ డోసులు వాడేటోళ్లకు ఉపయోగమన్నారు.

Latest Updates