దేశంలో 70శాతం మంది ప్రజలకు కరోనా సోకొచ్చు

జర్మనీలో సుమారు 70శాతం మంది ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉందని అన్నారు  ఆదేశ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్.  కరోనాపై మీడియాతో మాట్లాడిన ఆమె..వైరస్ పై పెద్ద ఎత్తున ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభం నుంచి ఎలా భయటపడాలో తెలియకపోయినప్పటికి కరోనా ప్రమాదం చాలా పెద్దదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరస్ ఉన్న ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రోగ నిరోధక శక్తి లేనప్పుడు, వైరస్ టీకాలు లేదా చికిత్స లు చేయలేనప్పుడు  60 నుండి 70% మంది వ్యాధి బారిన పడతారని చెప్పారు. మార్కెల్ వ్యాఖ్యలపై చెక్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాన్సలర్ వ్యాఖ్యలు ప్రజల్ని భయాందోళనను కలిగించేవిలా ఉన్నాయని అన్నారు.

ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ కంట్రోల్

ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన వివరాల ప్రకారం జర్మనీలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా 1567మందికి కరోనా సోకినట్లు గుర్తించింది.

ఎంపీకి సోకిన కరోనా వైరస్

జర్మన్ ఎంపీల్లో  ఓ ఎంపీకి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఫ్రీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీకి కరోనా సోకిందని, అతనితో పాటు అతని సిబ్బందిని ప్రత్యేకంగా ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు  ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పింది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై ఆగ్రహం

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై మార్కెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా గురించి డబ్ల్యూహెచ్ ఓ లో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదన్నారు. వైరస్ ను అరికట్టేలా డబ్ల్యూహెచ్ ఓ లో  నాయకత్వం లోపించిందన్నారు.  ఈ సందర్భంగా కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్సూ చించారు. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని..సాంప్రదాయ పద్దతిలో కళ్లతోనే పలకరించుకోవాలన్నారు.

Latest Updates