ఆట మొదలైంది.. గోల్‌ పడింది

డోర్ట్‌‌మండ్‌ (జర్మనీ): ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాం డవం చేస్తున్నా.. స్టేడి యంలో సాకర్‌ బాల్‌ గింగరాలు కొట్టింది. వైరస్‌ ను పక్కనబెడుతూ.. రెండు నెలలుగా నిలిచిపోయిన యూరోపియన్ మేజర్‌ లీగ్‌ ‘బుండెస్లిగా ’కు శనివారం తెరలేచింది. ఖాళీ స్టాండ్ స్‌ మధ్య మ్యాచ్‌ లు నిర్వహించినా..యాక్షన్‌ లో తేడా లేదు.. ప్లేయర్లలో ఇంటెన్సిటీ తగ్గలేదు. తొలి గోల్‌ కోసం హోరాహోరీగా పోరాడారు. బోరోసియా డోర్ట్‌‌మండ్‌ ప్లేయర్‌ ఎర్లింగ్‌ హాలెండ్‌ ఫస్ట్‌‌ గోల్‌ సాధించాడు. కరోనా తర్వాత మొదలైన టోర్నీలో తొలి గోల్‌ కొట్టిన ప్లేయర్‌ గా రికార్డులకెక్కాడు. శానిటైజ్‌ చేసిన బాల్స్‌ ను వాడటంతో పాటు గోల్‌ సెలబ్రేషన్స్‌ లో కూడా నియంత్రణ పాటించారు. ఒకరిమీద ఒకరు పడకుండా కేవలం మోచేతులు తాకిస్తూ సంబురాలు చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates