ఈ అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో తెలుసా..?

హద్దుల్లేని ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా కలుగుతుందో చెప్పలేం. అందుకే ప్రేమికులు నచ్చిన మనిషిపై నచ్చిన వస్తువులపై మనసు పారేసుకుంటారు. అలా విమానం పై మనసుపారేసుకున్న ఓ యువతి విమానాన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..విమానాన్ని మనువాడేందుకు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంది.

బెర్లిన్‌కు చెందిన మైకేల్‌ కోబ్కే(30) 2014లో టెగెల్ ఎయిర్ పోర్ట్ లో జెట్‌ బోయింగ్‌ 737 విమానాన్ని చూసింది. అంతే అప్పటి నుండి చూసి చూడంగానే నచ్చేసావే. అడిగి అడగకుండా వచ్చేసావే. నా మనసులోకి… హో. అందంగా దూకి. దూరం దూరంగుంటూ ఏం చేశావే. దారం కట్టి గుండె ఎగరేశావే అంటూ ఊహల్లో తేలిపోతుంది.

తొలిసారి 2019లో 40 టన్నుల జెట్‌ను ముద్దు పెట్టుకున్నట్లు తెలిపిన మైకేల్ విమానంపై తనకున్న  ప్రేమ ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేసింది.

తొలిసారి విమానాన్ని ముద్దు పెట్టుకున్న క్షణాన్ని నాజీవితంలో మరిచిపోలేను. నా జీవితంలో అందమైన క్షణాల్ని శాస్వతం చేసేకునేందుకు పెళ్లి చేసుకోనున్నట్లు విమానంపై తనకున్న బంధాన్నిచెప్పుకొచ్చింది.

విమానాన్ని పెళ్లి చేసుకుంటానని తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు చెప్పినట్లు తెలుస్తోంది. తొలత ఈ అమ్మాయి నిర్ణయం పట్ల అయోమయానికి గురైన తల్లిదండ్రులు ఆ తరువాత స్వాగతించినట్లు సమాచారం.

Latest Updates