న్యూక్లియర్ ప్లాంట్ వేస్ట్…వదిలించుకునుడెట్లా..?

న్యూక్లియర్​ పవర్​ వాడుకున్నంత సేపూ బాగానే ఉంటుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం రావచ్చు. కానీ, పొరబాటున ఎక్కడైనా ఏదైనా జరిగిందా… తరతరాలు అణు ధార్మికతకు గురవుతాయి. దాదాపు యాభై ఏళ్లుగా జర్మనీలో యాంటీ–న్యూక్లియర్​ ఉద్యమాలు సాగుతున్నాయి. చెర్నోబిల్​, ఫుకుషిమా ప్రమాదాల తర్వాత జర్మనీ కళ్లు తెరిచింది. 2022 నాటికి మొత్తం ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించింది. న్యూక్లియర్​ ఫ్యూయల్​ చాలా ప్రమాదకరం. ప్లాంట్లలో వాడేసిన ఫ్యూయల్​ రాడ్లను వదిలించుకోవడం చాలా శ్రమ. జర్మనీకి ఎదురవుతున్న బెడద ఇదే.

జర్మనీకి ప్రతి పాతిక ముప్పయ్యేళ్లకు ఒక బెడద వచ్చి పడుతుంది. రెండు జర్మనీలు ఏకమైన ముప్పయ్యేళ్లకు న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్లను మూసేయడం, అణు వేస్టేజీని పాతిపెట్టడం అనే కొత్త సమస్యలు ఎదురయ్యాయి.  జర్మనీ గత ఇరవై ఏళ్లుగా న్యూక్లియర్​ పవర్​ నుంచి నెమ్మదిగా తప్పుకుంటోంది. 2000 సంవత్సరంలో మొత్తం కరెంటు ఉత్పత్తిలో న్యూక్​ పవర్​ వాటా 29.5 శాతం. 2016 నాటికి 13 శాతానికి తగ్గించేసుకుంది. మరో మూడేళ్లలో జీరో లెవెల్​కి తీసుకురావాలన్నది జర్మనీ ప్రభుత్వ లక్ష్యం. పర్యావరణానికి హాని కలిగించని లో–కార్బన్​ ఎకానమీ వైపు జర్మనీ చూస్తోంది. రెన్యూవబుల్​ ఇంధన వనరులతో కరెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియని లో–కార్బన్​ ఎకానమీగా గుర్తిస్తారు. వీటివల్ల కార్బన్​ డయాక్సైడ్​ చాలా తక్కువగా విడుదలవుతుంది. ప్రధానంగా విండ్​ పవర్​, సోలార్​ పవర్​, హైడ్రో పవర్​లతో కరెంటుని పుట్టించుకోవడం జరుగుతుంది.

1986లో రష్యాలోని చెర్నోబిల్​ అణు విద్యుత్కేంద్రంలో జరిగిన పేలుడుతో ప్రపంచమంతా ఉలిక్కి పడింది. అప్పటివరకు న్యూక్లియర్​ పవర్​పై పెంచుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రపంచ దేశాలు న్యూక్​ పవర్​కి ప్రత్యామ్నాయాలకోసం వెదుక్కున్నాయి. ఆ తర్వాత జపాన్​లో జరిగిన ఫుకుషిమా ప్లాంట్​ ప్రమాదంతో ప్రపంచం మరింత వణికిపోయింది. 2011 మార్చి 11న జపాన్​లోని ఒకుమాలో భారీ  భూకంపంతో అలలు 14 మీటర్ల ఎత్తుకి ఎగసిపడి సునామీ సంభవించింది. అక్కడి ఫుకుషిమా డయిచి న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​ సునామీ దెబ్బకు ఘోరంగా దెబ్బతింది. చెర్నోబిల్​ ప్రమాదం తర్వాత ఫుకుషిమానే చెప్పుకుంటారు. దీనిని ఇంటర్నేషనల్​ న్యూక్లియర్​ ఈవెంట్​ స్కేల్​పై లెవెల్​–7 ప్రమాదంగా గుర్తించారు. సునామీ వల్ల ఫుకుషిమా ప్లాంట్​లో పవర్​ సప్లయి ఆగిపోయి, సకాలంలో కూలెంట్​ అందకపోవడంతో మూడు ముఖ్యమైన అణు రియాక్టర్లు కేవలం 72 గంటల్లో కరిగిపోయాయి. కరెంటు ఉత్పత్తిలో అణు రియాక్టర్లలో పనిచేసే ఫ్యూయల్​ రాడ్లు తట్టుకోలేనంత వేడిగా ఉంటాయట!

ఈ రెండు ప్రమాదాలతో జర్మనీలో అణు విద్యుత్కేంద్రాల్ని మూసేయాలన్న డిమాండ్​ మరింత బలంగా మారింది. థర్మల్​ విద్యుత్​తో పోలిస్తే న్యూక్లియర్​ పవర్​ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్నిస్తుందని, కాలుష్యాన్ని విడుదల చేయదని చెబుతారు. అయితే, ఇది నెత్తిమీద కుంపటిలాంటిది. న్యూక్​ పవర్​ ప్లాంట్లలోని రియాక్టర్లలో  ఉపయోగించే ఫ్యూయల్, వాటిద్వారా విడుదలయ్యే రేడియో యాక్టివ్​ వేస్టేజ్​ చాలా ప్రమాదకరమైనవి. సాధారణంగా ఫ్యాక్టరీల్లో వదిలేసినట్లుగా తూములద్వారాగానీ, లేదా బల్క్​గా ఏదోక చోట డంప్​ చేయడానికిగానీ వీల్లేదు. జర్మనీ న్యూక్​ పవర్​ ప్లాంట్లను మూసేయడం తేలికే. కానీ, కీలకమైనది ఈ వేస్టేజీ మేనేజ్​మెంటే. గతంలో అణు వేస్టేజీని వదిలించుకోవడానికి ఏరియాల్ని గాలిస్తున్నప్పుడు లోకల్​ జర్మన్లు అడ్డం పడ్డారు. 1980లో జర్మనీలో గ్రీన్​ పార్టీ ఏర్పడడానికి మూలం యాంటీ–న్యూక్లియర్​ మూమెంటే.

అక్కడి పాలిటిక్స్​లో న్యూక్లియర్​ వ్యతిరేకతకూడా ముఖ్యమైన అజెండాగా మారిపోయింది. అణు విద్యుత్​పై జర్మన్లకు అవగాహన కల్పిస్తుంటారు. న్యూక్లియర్​ టెక్నాలజీవల్ల ఎదురయ్యే రిస్క్​లపై మెజారిటీ జర్మన్లు ఆందోళన పడుతున్నారు. వేస్టేజీని వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాల్ని జనం అడ్డుకుంటున్నారు.

జర్మనీ ఒక్క దేశానికే న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్ల సమస్య కాదు… స్విట్జర్లాండ్​కూడా ఇదే ప్రాబ్లమ్​తో ఉంది. అక్కడ వాడుకునే మొత్తం కరెంటులో 40 శాతం అణు విద్యుత్తే! వీటిని 2034 నాటికి మూసేయాలని టార్గెట్​ పెట్టుకుంది.

A picture taken with a drone on August 9, 2019 near Koblenz shows a view of the cooling tower at Muelheim-Kaerlich nuclear power plant during its demolition in a controlled collapse. – The plant was shut down on September 9, 1988. (Photo by Thomas Frey / dpa / AFP) / Germany OUT

Latest Updates