కిలో పాత పేపర్‌కు రూ.50: పాత వస్తువులకు ‘బంపర్ ఆఫర్’

ఇంట్లో పనికి రాని వస్తువులు ఉంచలేక పడేయలేక చిరాకు తెప్పిస్తున్నాయా? పాత పోర్టబుల్ టీవీలు, డెస్క్‌టాస్స్, విరిగిపోయిన కుర్చీలు.. ఇలా వాడని వస్తువులు అడ్డంగా ఉన్నాయా? పాత న్యూస్ పేపర్లు కట్టల కొద్దీ పేరుకుపోయాయా? వాటిని అమ్ముదామంటే స్క్రాప్ షాపుల్లో మరీ చీప్‌గా అడుగుతున్నారని అలాగే వదిలేస్తున్నారా? అయితే వాటికి బయటి జంక్ దుకాణాలతో పోలిస్తే భారీగా రేటు ఇస్తూ బంపర్ ఆఫర్ పెట్టింది బిగ్ బజార్. పనికి రాని వస్తువులను ఇచ్చి కావాల్సిన వస్తువులును కొనుక్కోండంటూ భారీ ఎక్స్‌చేంజ్ వ్యాల్యూ ఆఫర్ ఇస్తోంది.

‘గ్రేట్ ఎక్స్‌చేంజ్’ పేరుతో మార్చి 11 వరకూ బిగ్ బజార్ స్టోర్స్ దగ్గర పనికిరాని వస్తువులకు మంచి రేటును ఆఫర్ చేస్తోంది. పాతవి ఎక్కువ ధరకు అమ్మేసి.. కొత్తవి తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ‘మేక్ మనీ ఫ్రం జంక్’ అని టెంట్లు పెట్టి మరీ మనకు పనికిరాని వస్తువులను తీసుకుంటోంది. వాటికి నిర్ణీత ధరను ప్రకటించి.. ఆ విలువకు తగ్గట్టుగా కస్టమర్లకు డిస్కౌంట్ కూపన్లు ఇస్తోంది. వాటిలో కొన్ని వస్తువుల ధరలు బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. కిలో పాత పేపర్లకు రూ.50, పాత దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, చెప్పులు, బొమ్మలకు రూ.100 చొప్పున డిస్కౌంట్ కూపన్లు పొందవచ్చు.  పాత గ్యాస్ స్టౌవ్‌కు రూ.500, ఒక్కో డోర్ మ్యాట్‌కు రూ.50, రెండు పాత టైర్లకు రూ.400 చొప్పున ఆఫర్ ఇస్తోంది బిగ్ బజార్.

వస్తువులు వాటి ఎక్స్‌చేంజ్ ధరలు ఇలా ఉన్నాయి..

 

Get Money For Junk: Great Exchange offer at Big Bazar stores

Latest Updates