ఘనాలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం.. జనం నిరసన

ghana-parliament-building-proposed-with-20cr-dollars-means-1400-cr-rs-n-people-protesting-against-it-63854546

భవనం సరిపోవడం లేదంటూ బిల్డింగ్ కూల్చివేతకు నిర్ణయం

రూ.1400కోట్ల ఖర్చుతో పెద్ద భవనం కట్టాలని నిర్ణయం

నాయకుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయనే సాకు

సోషల్ మీడియాలో పెద్దఎత్తున నడుస్తున్న ఉద్యమం

జులై 13న 20లక్షల మందితో భారీ నిరసనకు ప్రయత్నాలు

ఘనా దేశంలో కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మించాలన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20కోట్ల డాలర్స్ అంటే… దాదాపు రూ.14వందల కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో ప్రభుత్వం కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. గత శుక్రవారం పార్లమెంట్ లో కొత్త పార్లమెంట్ చాంబర్ డిజైన్ ను కూడా ప్రవేశపెట్టారు. 150 నుంచి 200 మిలియన్ డాలర్ల ఖర్చుతో భవన నిర్మాణం చేస్తున్నామని ఆ దేశ పార్లమెంటరీ శాఖ మంత్రి ఒసె కై మెన్సా బొన్సు చెప్పారు.

ఉన్నది సరిపోవడం లేదనే కారణంతో.. కొత్త పార్లమెంట్ చాంబర్ నిర్మిస్తే ప్రజాధనం వేస్టవుతుందంటూ అక్కడి ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యతిరేక ఉద్యమం పెద్దఎత్తున కొనసాగుతోంది. ఈ భవన నిర్మాణానికి వ్యతిరేకంగా.. 2 మిలియన్ల మంది అంటే.. 20 లక్షల మంది ఒక్కటై… జులై 13న భారీ నిరసన ర్యాలీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని సక్సెస్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది.

ఎకనామిక్ ఫైటర్స్ లీగ్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపితే.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదని.. అడ్డుకుంటామని అపోజిషన్ తెలిపింది.

Latest Updates