GHMCకి ప్రతిష్ఠాత్మక అవార్డు

GHMCకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేంద్ర పర్యాటక శాఖ 2016-17 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక కేంద్ర అవార్డును నిన్న (సెప్టెంబర్-26)న ప్రకటించింది. పర్యాటక స్థలాల్లో ఉత్తమ పౌర సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుతో.. GHMCకి వరుసగా రెండోసారి అవార్డును కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్‌ కు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు దక్కడంతో.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ (సెప్టెంబర్-27) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ లో రాష్ట్రపతి నుంచి ఈ అవార్డును GHMC జోనల్ కమిషనర్లు హరి చందన, శ్రీనివాస్ రెడ్డి అందుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates