GHMCలో ఉద్యోగాలు: 202 పోస్టులకు నోటిఫికేషన్లు

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది రాష్ట్ర సర్కారు. ఇందుకోసం  GHMCలో ఖాళీగా ఉన్న బిల్‌ కలెక్టర్‌ పోస్టులతోపాటు బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి TSPSC  ఏర్పాట్లు చేసింది. ఇవాళ(గురువారం,జూలై-19) న రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. GHMC లోని 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి.. వాటిని గ్రూపు-4 పరిధిలోకి తీసుకురానుంది. అలాగే బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో మరో 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. అందులో గ్రేడ్‌-2 అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 56 ఉండగా, గ్రేడ్‌-2 అసిస్టెంట్‌ స్టోర్‌ ఆఫీసర్‌ పోస్టులు 13 ఉన్నాయి. అలాగే మరో 9 డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

వీటితోపాటు వచ్చే వారం మరో 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వీటిలో 50 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు (బయాలజీతో ఇంటర్మీడియట్‌ అర్హతతో) ఉండగా, 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు (బయాలజీతో డిగ్రీ అర్హతతో) ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates