GHMCలో సైకిళ్లు : పర్యావరణ పరిరక్షణే టార్గెట్

జీహెచ్ఎంసీలో త్వరలో కొత్త సైకిళ్లు రానున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సైకిళ్లను తీసుకొస్తున్నారు అధికారులు. కార్మికుడి నుంచి కమిషనర్ వరకు వారంలో ఒకరోజు సైకిల్ పై ఆఫీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ ను స్వచ్ఛ నగరంగా మార్చడానికి.. పర్యావరణ పరిరక్షణ, సిబ్బంది హెల్త్ ఫిట్ నెస్ కోసం సైకిళ్లను తీసుకొచ్చే ప్రతయ్నం చేస్తోంది GHMC.

వారంలో ఒక్కరోజు ప్రతి ఒక్కరు సైకిల్ పైనే ఆఫీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ప్రతి శనివారం సైకిల్ పైనే ఆఫీసుకు వస్తున్నారు. జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ను తగ్గించడానికి సైకిళ్లను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ బై సైకిల్ క్లబ్ తో కలిసి జీహెచ్ఎంసీ సైకిళ్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఫేస్ లో లక్షా 50 వేలతో 20 సైకిళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా GHMC హెడ్ ఆఫీస్ లోనే పర్మినెంట్ సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో పనిచేసే ఎవరైనా సైకిళ్లను వాడుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. ముందుగా పేర్లు ఎన్ రోల్ చేసుకోవాలని.. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవంటున్నారు. సైకిల్ పై వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆఫీసు దగ్గరలో ఉన్నవాళ్లు వాహనాలకు బదులుగా సైకిల్ గానీ వాకింగ్ గానీ చేస్తే మంచిదంటున్నారు. ఇలా చేయడంతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు హెల్త్ కూడా బాగుంటుందని చెబుతున్నారు. నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చడానికి ప్రతి ఒక్కరు ముందకు రావాలని కోరుతున్నారు బల్దియా అధికారులు.

Posted in Uncategorized

Latest Updates