GHMC ఆఫీసులో అగ్ని ప్రమాదం

FIREE GHMCహైదరాబాద్ లోని ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం మంగళవారం (ఫిబ్రవరి-6) జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లోని అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది రెండు ఇంజిన్లతో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికిచేరుకున్న మేయర్ బొంతురామ్మోహన్ ప్రమాదానికి గురైన బిల్డింగ్ ని పరిశీలించారు. ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పలు సర్కిల్ కార్యాలయాలతో ఇరుకుగా ఉన్న జోనల్ ఆఫీసు నుంచి సర్కిల్ కార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో పూర్తయిన భవనాలకు తరలించాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates