GHMC ఇంజినీర్ల వింత ధోరణి : పరేషాన్ అవుతున్న వాహనదారులు

GHMC  ఇంజినీర్ల  వింత ధోర ణికి నగర ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. అస్తవ్యస్తంగా మారిన హైదరాబాద్ రోడ్లతో నిత్యం కుస్తీలు పడుతున్నారు. అసలే ఓ వైపు గుంతలు.. మరోవైపు సగంవేసి వదిలేసిన రోడ్లతో వాహనదార్లు పరేషాన్ అవుతున్నారు. నగరంలో ఎక్కడికెళ్లినా అదే సీన్ కనిపిస్తుంది. జీహెచ్ ఎంసీ ఇంజినీర్ల నిర్లక్ష్యంతో నగరవాసులకు శాపంగా మారింది.

కొద్దిపాటి వర్షాలకే హైదరాబాద్ రోడ్లు గుంతలమయంగా మారాయి. టూలైన్స్ మార్గంలో.. వన్ లైన్ వేసి.. మిగతాది వదిలేయటంతో.. ఎగుడుదిగుడు రోడ్లతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వాటికి తోడు మ్యాన్ హోల్స్, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ కట్టింగ్స్, గుంతలతో పరేషాన్ అవుతున్నారు. అప్ అండ్ డౌన్ రోడ్లతో వెన్ను సమస్యలు వస్తున్నాయని వాహనదారులు అంటున్నారు.

సిటీలో చాలా చోట్ల రోడ్లు ఎత్తు తగ్గించడానికి రోడ్లను మిల్లింగ్ చేశారు. మిల్లింగ్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు వాటిని పూర్తి చేయలేదు. ఈప్రాంతాల్లో టైర్లు స్కిడ్ఐ వాహనాలపై వెళ్లేవాళ్లు కింద పడిపోతున్నారు. బేగంపేట, కూకట్ పల్లి, మూసాపేట, దిల్ సుఖ్ నగర్, మాదాపూర్, సికింద్రాబాద్, తార్నాక, రామంతాపూర్, అంబర్ పేట, వీఎస్టీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసిన రోడ్లమీద నెలరోజుల్లోగా తిరిగి రోడ్డు వేయాల్సి ఉన్నా… జీహెచ్ ఎంసీ ఇంజినీర్లు పట్టించుకోవటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.

జర్మనీ టెక్నాలజీ పేరుతో ఎన్టీఆర్ మార్గ్ లో  రోడ్డువేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో విపరీతమైన దుమ్ము లేవడంతో.. సీఎం ఆదేశాల మేరకు.. మళ్లీ హుటాహుటిన అదే రోడ్డుపై బీటీ వేశారు. రద్దీ ప్రాంతాల్లో కొత్త ప్రయోగాలు వద్దని కేటీఆర్, బల్దియా కమిషనర్ చెప్పినా ఇంజినీర్లు పట్టించుకోవటం లేదు.

Posted in Uncategorized

Latest Updates